విజయ్- వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఈవారం వస్తున్న సినిమా గోట్. వెంకట్ ప్రభు మంచి దర్శకుడు. కానీ కమర్షియల్ సక్సెస్ రేటు తక్కువ. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ హక్కులు 22 కోట్లకు తీసుకున్నారు మైత్రీ మూవీ మేకర్స్.
ఏపీ, తెలంగాణ కలిపి 22 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తమే. అయితే ఇది కేవలం రిటర్న్ చేసే అడ్వాన్స్ లెక్కలోనే కనుక టెన్షన్ ఏమీ లేదు. కానీ విషయం ఏమిటంటే అసలు ఈ రేంజ్‌లో సినిమా పెర్ ఫార్మ్ చేస్తుందా అన్నదే.
ఏపీ, తెలంగాణ, సీడెడ్ కలిపి 22 కోట్ల మేరకు వసూలు చేయాలంటే సినిమా చాలా పెద్ద హిట్ కావాల్సి వుంటుంది. అంతకన్నా ముందు మంచి ఓపెనింగ్ పడాలి. పైగా ఇప్పటికే థియేటర్లలో సరిపోదా శనివారం వుంది. మరో మూడు ప్రామిసింగ్ సినిమాలు గోట్ తో పాటు వస్తున్నాయి. ఇవన్నీ దాటుకుని గోట్ ఫీట్ సాధించాలి.
గోట్ కు తెలుగునాట సమస్య ఏమిటంటే పెద్దగా ప్రీ పబ్లిసిటీ జరగలేదు. టీమ్ సినిమాను తమిళనాట ప్రచారం చేయడంతోనే సరిపోయింది. ఇక్కడ అస్సలు పట్టించుకోలేదు.
నిన్నటికి నిన్న జస్ట్ టీమ్ వచ్చి హడావుడి చేసి వెళ్లింది కానీ అది జనానికి రీచ్ అయ్యే హడావుడి కాదు. కనీసం రెండు మూడు వారాల ముందు నుంచి హడావుడి చేసి వుంటే వేరుగా వుండేది. పైగా టైటిల్ కూడా కాస్త వీక్ అనే టాక్ వినిపిస్తోంది. అందువల్ల టార్గెట్ చేరుతుందా అన్నది చూడాలి.
Call boy jobs available 8341510897
vc estanu 9380537747
ఎలాగూ మేం థియేటర్లో చూడం
Flop movie