గురుద్రోహం-నిర్మాతదర్శకుడి ఆవేదన

ఇబ్బందుల్లో వున్నామని తెలిసి కూడా సినిమా మీద సినిమా వేస్తారా అని నిలదీసారట

‘ఆ ఇద్దరూ గురుద్రోహం చేస్తున్నారు. కష్టాల్లో వున్న తనకు సాయం చేయాల్సింది పోయి, మరింత ఇబ్బంది పెడుతున్నారంటూ’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

విషయం ఏమిటంటే ఓ దర్శకనిర్మాత ఓ సినిమా చేస్తున్నారు. అదే రోజు మరికొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. గురు పూర్ణిమ రోజే తమ సినిమా మీద పోటీగా వాళ్ల సినిమా డేట్ వేసారట. అది చూసి, ఆ నిర్మాత ఫోన్ తీసుకుని హీరో దగ్గర వాళ్లకు ఫోన్ చేసి, ఇది గురుద్రోహం తప్ప వేరు కాదు అని బాధపడ్డారట.

ఇబ్బందుల్లో వున్నామని తెలిసి కూడా సినిమా మీద సినిమా వేస్తారా అని నిలదీసారట. పైగా ఇంకా వర్క్ పెండింగ్ లో వుండగా డేట్ వేయడం అవసరమా అని అడిగారట. దీనికి ఇవతలి వాళ్లు అప్పుడు ఏమీ స్పందించలేదు కానీ మా హీరోకి లైఫ్ ఇవ్వడం ఏమిటి అని ఆయన సన్నిహితులు కామెంట్ చేస్తున్నారు. ఆ దర్శకుడు కష్టంలో వున్నపుడే తమ హీరో ఆదుకుని సినిమా ఇచ్చారని అంటున్నారు.

అసలే సదరు నిర్మాతకు ఈ దర్శకుడికి మధ్య గతంలో ఓ పార్టీలో గొడవ వుందనే గుసగుసలు వున్నాయి. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ పోటీకి దిగారని సదరు నిర్మాత సన్నిహితులు అంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిళ్లలో ఈ ‘గురుద్రోహం’ అన్న కామెంట్ మీద ఆఫ్ ది రికార్డ్ డిస్కషన్ నడుస్తోంది.

7 Replies to “గురుద్రోహం-నిర్మాతదర్శకుడి ఆవేదన”

  1. హరీష్ శంకర్ నిన్ను వాయించడం లో తప్పేమీ లేదని నిరూపిస్తున్నావు

Comments are closed.