బెల్లంకొండ శ్రీనివాస్ నెత్తికి ఎత్తుకున్న బరువైన భారం…చత్రపతి. తెలుగులో రాజమౌళి-ప్రభాస్ లాంటి కాంబినేషన్ లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ఎమోషనల్ యాక్షన్ సినిమా అది. దానిని మళ్లీ రీ ప్రొడ్యూస్ చేయడమే సాహసం.
ప్రభాస్ పాత్రలో నటించడం ఇంకా సాహసం. పైగా అది కూడా హిందీలో నిర్మించడం. ఇన్ని భారాలు తలకెత్తుకోవడం వల్ల బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా అంటూ తెరపైకి వచ్చి చాలా కాలం అయిపోయింది.
వివి వినాయక్ డైరక్షన్ లో ఛత్రపతి రీమేక్ రెడీ అయింది కానీ అదే టైటిల్ దొరకలేదు. హిందీలో ఛత్రపతి లేదా దానికి దగ్గర టైటిల్ కోసం కిందా మీదా పడ్డారు. అందుకే సినిమా విడుదల ఆలస్యం అవుతోందంటూ వార్తలు కూడా వినిపించాయి. ఈ లోగా అసలు థియేటర్ లోకి రాదు..ఓటిటికి వెళ్తోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.
ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే ఈ సినిమా ఏదో విధంగా ఛత్రపతి టైటిల్ సంపాదించారంట. మే అయిదున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. ఛత్రపతి టైటిల్ అన్నది దొరకడం పెద్ద అచ్యూవ్ మెంట్. ఇప్పుడు డేట్ కావాలి. మే 5 అన్నది ఫిక్స్ చేసుకున్నారు. అటు ఇటు సరైన కాంపిటీషన్ లేకపోతే అదే డేట్ ఫిక్స్ అవుతుంది.