రొటీన్ పాత్రలు చేసే కంటే ఐటెంసాంగ్స్ బెస్ట్

హీరోయిన్ గా అవకాశాలు రాక కొంతమంది, బాగా డబ్బులొస్తాయని మరికొంతమంది ఐటెంసాంగ్స్ చేస్తుంటారు. అయితే దాన్ని సమర్థించుకునేందుకు వాళ్లు చెప్పే లాజిక్కులు మాత్రం నవ్వు తెప్పిస్తాయి. డాన్స్ చేయడానికి బాగా స్కోప్ ఉందని, రెడ్…

హీరోయిన్ గా అవకాశాలు రాక కొంతమంది, బాగా డబ్బులొస్తాయని మరికొంతమంది ఐటెంసాంగ్స్ చేస్తుంటారు. అయితే దాన్ని సమర్థించుకునేందుకు వాళ్లు చెప్పే లాజిక్కులు మాత్రం నవ్వు తెప్పిస్తాయి. డాన్స్ చేయడానికి బాగా స్కోప్ ఉందని, రెడ్ సినిమాలో ఐటెంసాంగ్ ఒప్పుకుందట హెబ్బా పటేల్. మిలట్రీ కాస్ట్యూమ్ నచ్చి సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిందట తమన్న. ఇలా హీరోయిన్లు చెప్పే లాజిక్కులు వింతగా, ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి హంసానందిని కూడా చేరిపోయింది. హీరోయిన్ గా తనకొచ్చే రోల్స్ నచ్చక ఐటెంసాంగ్స్ వైపు షిఫ్ట్ అయ్యానంటోంది ఈ బ్యూటీ.

“ఈగ, మిర్చి బ్యాక్ టు బ్యాక్ చేశాను. నా స్పెషల్ ఎప్పీయరెన్స్ లు అక్కడ్నుంచే మొదలయ్యాయి. నిజానికి వాటి కంటే ముందు నాకు హీరోయిన్ గా చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే అందులో నా పాత్రలకు పెద్దగా గుర్తింపు లేదు. అలాంటి గుర్తింపు లేని హీరోయిన్ పాత్రలు చేసే కంటే స్పెషల్ సాంగ్స్ చేయడం బెటర్ అనిపించింది. పైగా నాకు మ్యూజిక్, డాన్స్ అంటే ఇష్టం. అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాను.”

ఇలా ఐటెం సాంగ్స్ చేయడాన్ని సమర్థించుకుంది హంసానందిని. ఐటెంసాంగ్స్ అన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయట. ఒక్కో సాంగ్ లో ఒక్కో రకమైన డాన్స్ చేయాలని, ఆ ప్రాసెస్ తనకు చాలా ఇష్టమని చెబుతోంది హంసానందిని. తను మరాఠీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చానని, కానీ మిర్చిలో ఆంధ్రా స్టయిల్ ఫోక్ సాంగ్ చేయాల్సి వచ్చిందని, అలాంటి ఛాలెంజెస్ ఇష్టపడతానని చెబుతోంది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిన ఈ ముద్దుగుమ్మ.. రకరకాల వంటలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడుతూ బిజీ అయిపోయింది.

ఇప్పటికైనా జగన్ విజన్ ని ప్రతిపక్షాలు, పచ్చపాత మీడియా తెలుసుకుంటే మేలు