
తెలుగు, దక్షిణాదిన వివిధ సినిమాల్లో నటించి, ఇక్కడ కెరీర్ ఉన్నంత కాలం కిక్కురమనకుండా, ఇక్కడ సినిమాలు తగ్గిపోయాకా.. బాలీవుడ్ వైపు వెళ్లిన నటీమణులు సౌత్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం కొత్తేం కాదు.
రాధికా ఆప్తేతో మొదలుపెడితే చాలా మంది ఇలా మాట్లాడారు. అవకాశవాదం అనిపించుకున్నారు. వాస్తవానికి కాస్టింగ్ కౌచ్ అంశమే అవకాశవాదంతో కూడుకున్నదని, అవకాశాలు ఉన్నన్ని రోజులు సర్దుకుపోయి, ఆ తర్వాత మాట్లాడుతున్నారనే విమర్శ ఉంది. అయితే వేధింపులకు గురైన వారు ఎప్పుడు స్పందించినా అది స్పందించాల్సిన అంశమే.
మరి ఈ జాబితాలో హన్సిక కూడా ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అలాంటేదీ లేదని హన్సిక ట్వీట్ చేసింది. తను చెప్పినట్టుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ హన్సిక వివరణ ఇచ్చింది. తన కెరీర్ బిగినింగ్ స్టేజ్ లో ఉండగా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఒక యువనటుడు తనతో కొంచెం అతిగా ప్రవర్తించినట్టుగా.. ఇలా తను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని హన్సిక చెప్పినట్టుగా వార్తలు ప్రచురితం అయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిపై హన్సిక తీవ్రంగా స్పందించింది. తను చెప్పని విషయాలు చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మండిపడుతోంది.
బాలీవుడ్ బాలనటిగా కెరీర్ ప్రారంభించిన హన్సిక తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ అయ్యాయి. టీనేజ్ లో నే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగుకు మించి తమిళంలో స్టార్ గా ఎదిగింది. సుమారు యాభైకి పైగా సినిమాలను పూర్తి చేసుకుని ఈ మధ్యనే పెళ్లి చేసుకుంది హన్సిక.
ఆమె పెళ్లి కథను ఒక ఓటీటీ సంస్థ వెబ్ సీరిస్ గా ప్రసారం చేసింది. దీనికి గానూ హన్సిక మంచి అమౌంట్ పొందిందని వినికిడి. ఈ నేపథ్యంలో ఆమె పర్సనల్ అంశాలు వార్తల్లో నిలిచాయి. అయితే కాస్టింగ్ కౌచ్ వేధింపుల విషయంలో మాత్రం అబద్ధాల ప్రచారం జరుగుతోందని హన్సిక వాపోతోంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా