Advertisement

Advertisement


Home > Movies - Movie News

పండగ మారినా.. ప్రకటన మాత్రం మారలేదు

పండగ మారినా.. ప్రకటన మాత్రం మారలేదు

హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా ఆగిపోయి చాన్నాళ్లయింది. మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేరు. ఇలాంటి టైమ్ లో సినిమాను లైమ్ లైట్లో ఉంచేందుకు కిందామీద పడుతున్నారు మేకర్స్.

అయితే ఈ క్రమంలో వాళ్లు చేస్తున్న ఓ ప్రకటన మాత్రం రొటీన్ వ్యవహారాన్ని తలపిస్తోంది. పండగొస్తే చాలు హరిహర వీరమల్లు టీజర్ వస్తోందంటూ ఎదురుచూడడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం కామన్ గా మారింది.

శివరాత్రికి హరిహర వీరమల్లు సినిమా నుంచి స్పెషల్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ పోస్టర్ తోనే సరిపెట్టారు. ఆ తర్వాత ఉగాది కూడా వెళ్లిపోయింది. తాజాగా శ్రీరామనవమి పండగ కూడా గడిచిపోయింది. ఈసారి కూడా పోస్టర్ తోనే సరి. పవన్ సినిమా నుంచి టీజర్ మాత్రం రాలేదు.

ఇలా పండగలు మారుతున్నప్పటికీ, మేకర్స్ స్టేట్ మెంట్ మాత్రం మారలేదు. త్వరలోనే టీజర్ వస్తోందంటూ మరోసారి ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు మరో పండగ కోసం వెయిట్ చేస్తున్నారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాన్నాళ్లుగా షూట్ మోడ్ లోనే ఉంది. మధ్యలో అర్జున్ రాంపాల్ లాంటి నటులు వచ్చి వెంటనే తప్పుకున్నాడు. నిధి అగర్వాల్ అయితే ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. అటు క్రిష్ కూడా.

పవన్ మాత్రం తన సినిమాలన్నింటినీ తాత్కాలికంగా పక్కనపెట్టాడు. పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టిపెట్టాడు. జూన్ నెలాఖరుకు పవన్  సినిమాల్లో కదలిక వచ్చే అవకాశం ఉంది. ఆ కదలికల్లో హరిహర వీరమల్లు ఉంటుందా ఉండదా అనేది చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?