నిర్మాత దిల్ రాజు.. దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికి అయిదు సినిమాలు వచ్చాయి. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3. ఇప్పుడు ఆరో సినిమా రాబోతోంది.
అలాగే అనిల్ రావిపూడి ఇప్పటి వరకు అన్నీ హిట్ లే కొట్టినా, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ వెరీ స్పెషల్. ఎఫ్ 2, ఎఫ్ 3 చేసారు. ఇప్పుడు మూడో సినిమా చేయబోతున్నారు.
అంటే ఓ డబుల్ హ్యాట్రిక్, ఇంకో హ్యాట్రిక్ అన్నమాట. అనిల్ రావిపూడి-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయింది. దిల్ రాజు నిర్మాత. విలేజ్ బ్యాక్ డ్రాప్, పట్నం టచ్ తో వుండే హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సబ్జెక్ట్ ను అనిల్ తయారు చేసినట్లు తెలుస్తోంది. తనకు సూటయ్యే సరైన సబ్జెక్ట్ కోసం వెంకటేష్ రకరకాల ట్రయిల్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సబ్జెక్ట్ తనకు టైలర్ మేడ్ గా వుంటుందని నమ్ముతున్నారు.
వెంకటేష్ కూడా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేసి చాలా కాలం అయింది. ఈ సినిమా త్వరలో సెట్ మీదకు వెళ్తుంది.. మరిన్ని వివరాలు తరువాత మరోసారి.