Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరో పెళ్లి వాయిదా

హీరో పెళ్లి వాయిదా

పాపం, హీరో నిఖిల్ పెళ్లి మళ్లీ వాయిదా పడిపోయింది. ఎంతో ఉత్సాహంగా పెళ్లి చేసుకుందామనుకున్న నిఖిల్ ఆశలపై కరోనా నీళ్లు చల్లేసింది. హీరో నిఖిల్ పెళ్లి ఈ నెల 16న డాక్టర్ పల్లవివర్మతో జరగాల్సి వుంది. వీళ్లది ప్రేమ వివాహం. కరోనా వచ్చిన తరువాత కూడా, ఎక్కడా కాకుంటే గుడిలో అయినా చేసేసుకుంటాం అని హీరో నిఖిల్ ప్రకటించారు.

కానీ ఇప్పుడు గుడులు కూడా తీసిలేవు. దాంతో ఇక వాయిదా తప్పలేదని నిఖిల్ ప్రకటించారు. ఇప్పటికే మరో హీరో నితిన్ వివాహం కూడా వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. నితిన్ కాస్త భారీగా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసారు. అది కూడా దుబాయ్ లో. అది సాధ్యం కాదు కనుక ముందే వాయిదా వేసేసారు. ఇప్పుడు నిఖిల్ వంతు అయింది. 

కొన్నేళ్ల కిందట నిఖిల్ కు సంబంధం కుదిరిందని, పెద్దలు అరేంజ్ చేసినదే అని వార్తలు వచ్చాయి. మళ్లీ అది అప్పట్లో ఎందుకో ఆగిపోయింది. ఇన్నాళ్లకు ప్రేమ చిగురించి, పెళ్లి సెట్ అయింది అంటే కరోనా అడ్డం పడింది. త్వరలో లాక్ డౌన్ ఎత్తేస్తారని, నిఖిల్ పల్లవి వర్మలు పెళ్లి పీటలు ఎక్కుతారని ఆశిద్దాం.

లాక్ డౌన్ లో హైదరాబాద్ ఏరియల్ వ్యూ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?