రామ్ కు సంక్రాంతి ప్లస్సా.. మైనస్సా?

ప్రతి హీరోకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సంక్రాంతి బరిలో వస్తే కచ్చితంగా హిట్ కొడతామనే ఫీలింగ్ లో కొందరు ఉంటారు. అయితే రామ్ విషయంలో మాత్రం సంక్రాంతి సీజన్ మిక్స్ డ్ రిజల్ట్ ఇచ్చింది.…

ప్రతి హీరోకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సంక్రాంతి బరిలో వస్తే కచ్చితంగా హిట్ కొడతామనే ఫీలింగ్ లో కొందరు ఉంటారు. అయితే రామ్ విషయంలో మాత్రం సంక్రాంతి సీజన్ మిక్స్ డ్ రిజల్ట్ ఇచ్చింది. అందుకే అతడు కొన్నేళ్లుగా ఈ సీజన్ కు దూరంగా ఉంటున్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత, తప్పనిసరి పరిస్థితుల మధ్య ఇప్పుడు మరోసారి సంక్రాంతికొస్తున్నాడు.

రామ్ నటించిన రెడ్ మూవీ సంక్రాంతి బరిలో దిగబోతోంది. నిజానికి ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదు. రామ్ కు అలాంటి ఆలోచనలు కూడా లేవు. కాకపోతే లాక్ డౌన్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం, దగ్గర్లో సంక్రాంతి సీజన్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో రెడ్ మూవీని సంక్రాంతికి తీసుకొస్తున్నాడు ఈ హీరో.

ఇక రామ్ కెరీర్ లో సంక్రాంతి ట్రాక్ రికార్డ్ విషయానికొస్తే.. పెద్ద పండగ ఈ హీరోకు ఓ హిట్ ఇస్తే, ఓ ఫ్లాప్ ఇచ్చింది. హీరోగా రావడం రావడమే తొలి సినిమా దేవదాసును సంక్రాంతి రిలీజ్ చేశాడు రామ్. అది పెద్ద హిట్టయింది. ఆ ఉత్సాహంతో మస్కా అనే సినిమాను రిలీజ్ చేస్తే, అది కాస్తా పెద్ద ఫ్లాప్ అయింది.

2009లో వచ్చిన మస్కా తర్వాత మళ్లీ సంక్రాంతి వైపు కన్నెత్తిచూడలేదు ఈ హీరో. మళ్లీ ఇన్నేళ్లకు, అంటే పుష్కర కాలం తర్వాత మరోసారి సంక్రాంతి బరిలో రెడ్ మూవీతో అడుగుపెడుతున్నాడు. ఈసారి అతడికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. 

ప‌చ్చ మీడియా ప‌గ‌టి క‌ల‌లు