హీరో శౌర్య స్వంత బ్యానర్!

హీరో నాగశౌర్య తన స్వంత బ్యానర్ ను ఫ్లోట్ చేయబోతున్నారా? ఈ మేరకు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నాగశౌర్యకు స్వంత ఫ్యామిలీ బ్యానర్ వుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై శౌర్య తల్లి ఉష సినిమాలు…

హీరో నాగశౌర్య తన స్వంత బ్యానర్ ను ఫ్లోట్ చేయబోతున్నారా? ఈ మేరకు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నాగశౌర్యకు స్వంత ఫ్యామిలీ బ్యానర్ వుంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై శౌర్య తల్లి ఉష సినిమాలు నిర్మించారు. తండ్రి శంకర ప్రసాద్ సమర్పించారు. ఛలో, అశ్వద్ధామ, కృష్ణ వృింద విహారి లాంటి మంచి సినిమాలు ఈ బ్యానర్ నుంచి వచ్చాయి. అయితే శౌర్య పేరెంట్స్ సినిమా నిర్మాణం మీద ఇక అంత ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

అందుకే కావచ్చు శౌర్య తన స్వంత బ్యానర్ ను కొంత మంది స్నేహితులతో కలిసి స్టార్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. శౌర్య మొదటి నుంచీ ఇండిపెండెంట్ గానే వుంటూ వస్తున్నారు. ఇప్పుడు పెళ్లి కూడా అయింది. అందువల్ల తన కెరీర్ ను తను చూసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు.

ఈ విషయమై శౌర్యను అడిగితే, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్ లో చేస్తానో, చేయనో తెలియదని అన్నారు. ప్రస్తుతం చేతిలో వున్న ఒకటి రెండు సినిమాలను మంచి సినిమాలుగా మార్చడం మీదనే దృష్టి వుందన్నారు. 

శౌర్య తల్లి ఉషను ప్రశ్నించగా, తాము అయితే టాలీవుడ్ కు దూరంగానే వున్నామని, పిల్లలు పెరిగిన తరువాత వాళ్ల వ్యాపారాలు వాళ్లు చేసుకుంటే తప్పేంటని అన్నారు. అలా అని శౌర్య బ్యానర్ పెడుతునాడని కానీ, లేదని కానీ తాను చెప్పడం లేదన్నారు.