Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరో సుశాంత్ పై కేసు నమోదు!

హీరో సుశాంత్ పై కేసు నమోదు!

నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు. ఆయన ఒకప్పుడు సినిమా నిర్మాత. హీరో సుశాంత్ తో మాత్రమే వరుసగా సినిమాలు నిర్మించారు. సుశాంత్ తల్లి నాగసుశీలతో వ్యాపార లావాదేవీలు వున్నాయి. ఈ మేరకు ఓ లేఅవుట్ డెవలప్ మెంట్‌కు సంబంధించి సివిల్ కేసు నడుస్తోంది. 

ఇలాంటి నేపథ్యంలో నాగసుశీల, సుశాంత్, కొంతమంది బౌన్సర్లు ఆ లేఅవుట్ దగ్గరకు వెళ్లారు. ఆ లేఅవుట్ లో హీరో సుమంత్ కు 500 గజాల స్థలం వుంది. అది చూడడానికి వచ్చామని వారు చెప్పారు. అంత మంది బౌన్సర్లతో రావడం, రెండు మూడు కార్లలో రావడాన్ని ఆ లేఅవుట్ దగ్గర భవంతిలో వున్న వారు వీడియో తీసారు. ఈ సుమారు వెయ్యి గజాల్లో వున్న ఈ బిల్డింగ్ వాస్తవానికి నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుదే. ఆయన దానిని ఓ ట్రస్ట్ కు డొనేట్ చేసారు.

ఇప్పుడు ఈ బృందం అంటే హీరో సుశాంత్ వెళ్లింది ఆ ఇంటి దగ్గరకే. సుమంత్ సైట్ చూడడానికి వెళ్లామన్నది వీరి వాదన. సుమంత్ సైట్ తో వీళ్లకు ఏం సంబంధం? కేవలం భయ భ్రాంతులను చేయడానికే మందిని వేసుకుని వచ్చారు. సిసి టివీ వైర్లు చాలా వెల్ ప్లాన్డ్ గా కట్ చేసి, మళ్లీ గమ్ తో అతిగారు. దాంతో ఏవీ రికార్డు కాలేదు అన్నది వారి వాదన.

మొత్తానికి కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే ఫిర్యాదు చేసిన వారు తమ కాస్ట్ సర్టిఫికెట్ లు ఇచ్చి అట్రాసిటీ కేసు పెట్టాలని, తమను దూషించారని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మేరకు పోలీసుల దగ్గర పంచాయతీ నడుస్తోంది.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా