డిమాండ్ లో వుంటే డిమాండ్ లు ఓ రేంజ్ లో వుంటాయి టాలీవుడ్ లో. అలా కాకుండా ఒక్క సినిమా చేసిన తరువాతే డిమాండ్ల లిస్ట్ బయటకు తీస్తే, అమ్మో..అమ్మడు అనుకోవాల్సిందే. ఆ అమ్మాయి ఒక్కటంటే ఒక్కటి..'చిన్న' సినిమా చేసింది. అది కూడా థియేటర్ కు రాకుండా కరోనాపుణ్యమా అని ఓటిటికి వెళ్లిపోయింది. పోనీ అలా అని ఉప్పెన హీరోయిన్ లా అమాతం పేరు వచ్చిందా అంటే అదీ లేదు.
ఆ తరువాత మళ్లీ సినిమా లేదు. ఇప్పుడు సినిమా కోసం అడుగుతుంటే రెమ్యూనిరేషన్ తో పాటు డిమాండ్ల జాబితా వాట్సాప్ చేస్తోందట. మొదటి సినిమాకు పెద్ద బ్యానర్ దగ్గర జస్ట్ అయిదు లక్షలు తీసుకుంది. ఇప్పుడు రెండో సినిమాకు 17 లక్షలు అడుగుతోంది. పోనీ ఇవ్చొచ్చు, హీరోయిన్ల కొరత వుందనుకుంటే డిమాండ్లు మామూలుగా లేవు..
డిమాండ్ వన్..మేకప్ మెన్, హెయిర్ డ్రెసర్ ను ముంబాయి నుంచే వాళ్ల చాయిస్ ప్రకారం తెచ్చుకుంటారు. వాళ్లకు నిర్మాత పే చేయాలి.
డిమాండ్ 2. హీరోయిన్ కు ఆమె మేనేజర్ లేదా కూడా వచ్చేవారికి ఫైవ్ స్టార్ అకామడేషన్ ఇవ్వాలి. అలాగే రూమ్ సర్వీస్ కూడా ఇవ్వాలి. అంటే ఏం కావాలంటే అది వాళ్లు ఆర్డర్ ఇచ్చుకుని తినొచ్చన్నమాట.
డిమాండ్ 3. హీరోయిన్ స్టాఫ్ కు త్రీ స్టార్ అకామడేషన్,. ఫుడ్ ఇవ్వాలి
డిమాండ్ 4. షూటింగ్ టైమ్ లో ప్రొడక్షన్ ఫుడ్ తినరు. బయట నుంచి తెచ్చి ఇవ్వాలి.
డిమాండ్ 5. సింగిల్ డోర్ క్యారవాన్ ఇవ్వాలి. షేరింగ్ క్యారవాన్ పనికిరాదు.
డిమాండ్ 6. షూటింగ్ సమయాల్లో ఆమె అదుపాజ్ఞాల్లో ఓ కారు వుండాలి.
డిమాండ్ 7. ఇవన్నీ ఓకె అన్నా కూడా కిస్ సీన్లు, బికినీ సీన్లు చేయదు.
ఈ డిమాండ్లు చూసి, ఆమెను సినిమాల్లోకి తీసుకోవాలనుకుంటున్నవారు గుడ్లు తేలేస్తున్నారు