బాలీవుడ్ జంటల ప్రేమ, పెళ్లి, విడాకులపై హీరోయిన్ సోనం కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ కపుల్ అమీర్‌ఖాన్-కిరణ్‌రావు విడపోవంతో పాటు అంతకు ముందు మరికొన్ని జంటలు విడాకులు తీసుకున్న నేపథ్యంలో సోనం కపూర్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అదృష్టవశాత్తూ తాను బాలీవుడ్‌కు సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుని, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2018లో సోనం కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను పెళ్లాడారు. ఇదిలా ఉండగా ఒక మ్యాగజైన్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
‘దేవుడి దయ వల్ల ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోలేదు. అందుకు నిజంగా కృతజ్ఞురాలిని. అక్కడ (బాలీవుడ్) పనిచేసే వాళ్ల ప్రపంచం సంకుచితంగా ఉంటుంది. బాలీవుడ్‌లో జరుగుతున్నది ఇదే. నాలాగా ఆలోచించే, ఫెమినిస్ట్‌ను పెళ్లాడటం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి’ అని సోనం పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్న తర్వాత తన జీవితం ఎలా సాగుతున్నదో ఆమె వివరించారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ బంధం ఉందో ఆమె మాటల్లో తెలుసుకోవచ్చు.
‘పెళ్లైన నాటి నుంచి ఈ ఏడాదే మేం ప్రతి రాత్రి కలిసి గడుపుతున్నాం. ఎందుకంటే ముంబై- ఢిల్లీ- లండన్‌ల మధ్య ప్రయాణాలకే సమయం సరిపోయేది. మాకు ఒకరి పట్ల ఒకరికి విడదీయలేని ప్రేమ ఉంది. ఇద్దరం కలిస్తే సంతోషాలకు కొదవే ఉండదు. లండన్‌లో ఒంటరిగా ప్రయాణించడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ఇక్కడ భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు, మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన ఎంతో మంది ప్రజలను చూశాను. వాళ్లకి బాలీవుడ్ అంటే ఒక రకమైన పిచ్చి ఉంటుందని నాకు అర్థమైంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
మొత్తానికి బాలీవుడ్‌లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్‌పై సర్వత్రా విమర్శలు రావడం విశేషం. సోనం కపూర్ కామెంట్స్ బాలీవుడ్‌లో విడిపోయిన జంటలపై పెద్ద విమర్శగా చెప్పుకోవచ్చు.