కొత్త ఏడాది ప్రారంభంలోనే కొంతమంది హీరోయిన్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తమ పెళ్లి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెల్లోనే పెళ్లి చేసుకోబోతోంది. ఈనెల 22న గోవాలో రకుల్-జాకీ భగ్నానీ పెళ్లి ఉంటుంది. ఈ మేరకు గోవాలోని ఓ రిసార్ట్ లో ఏర్పాట్లు మొదలయ్యాయి.
నిజానికి వీళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్ లో భాగంగా మిడిల్-ఈస్ట్ లో పెళ్లి చేసుకోవాలని భావించారు. అక్కడ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. అంతలోనే ప్రధాని మోదీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ పై పిలుపునివ్వడంతో, రకుల్ తన పెళ్లి వేదికను మార్చుకుంది. గోవాలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.
మరో హీరోయిన్ తమన్న కూడా పెళ్లికి ముస్తాబవుతోంది. చేతిలో ఉన్న ఓ సినిమాతో పాటు, వెబ్ సిరీస్ ను పూర్తి చేసిన మిల్కీ బ్యూటీ, ప్రస్తుతం దేవాలయాల దర్శనాల్లో ఉంది. భాటియా కుటుంబంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, పెళ్లికి ముందు ఇలా కొన్ని దేవాలయాలు సందర్శిస్తోంది తమన్న. ఈ నెల్లోనే తమన్న-విజయ్ వర్మల పెళ్లి తేదీ బయటకు రాబోతోంది.
ఇక మరో హీరోయిన్ మీరా చోప్రా కూడా త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది. మార్చి లో మీరా చోప్రా పెళ్లి ఉంటుంది. రాజస్థాన్ లో జరగనున్న ఈ పెళ్లికి మీరా చోప్రా కజిన్ ప్రియాంక చోప్రా హాజరుకానుంది.
మరో హీరోయిన్ కృతి కర్బందా కూడా త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. నటుడు పుల్కిత్ సామ్రాట్ తో ఈమె ఎంగేజ్ మెంట్ తాజాగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని బయటపెడతారు. ఇలా చాలామంది హీరోయిన్లు రాబోయే 2-3 నెలల్లో పెళ్లిళ్లు చేసుకోబోతున్నారు.