హర్రర్ థ్రిల్లర్ లో కళ్యాణ్ రామ్!

హీరో కళ్యాణ్ రామ్ ఆచి తూచి సినిమాలు చేస్తారు. అలా చేసే సినిమాలు కాస్త విభిన్నంగా వుండేలా చూసుకుంటారు. తొందరపడి ఎడా పెడా సినిమాలు చేసేయరు. బింబిసార సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. డెవిల్…

హీరో కళ్యాణ్ రామ్ ఆచి తూచి సినిమాలు చేస్తారు. అలా చేసే సినిమాలు కాస్త విభిన్నంగా వుండేలా చూసుకుంటారు. తొందరపడి ఎడా పెడా సినిమాలు చేసేయరు. బింబిసార సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. డెవిల్ సినిమా రెడీ అవుతోంది. డెవిల్ సినిమా పీరియాడిక్ బ్యాక్ గ్రవుండ్ స్పై మూవీ. దీని తరువాత ఏమిటి అన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. 

బింబిసార సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ లోగా ఓ హర్రర్ థ్రిల్లర్ చేసే ఆలోచనలో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఓ దర్శకుడు చెప్పిన హర్రర్ థ్రిల్లర్ కథ, కాన్సెప్ట్ నచ్చి ఆల్ మోస్ట్ ఓకె చెప్పాడని తెలుస్తోంది. అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సరైన టైమ్ లో సరైన విధంగా అనౌన్స్ చేసే ఆలోచనలో కళ్యాణ్ రామ్ వున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడే మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఓ దర్శకుడు కథ, చెప్పడం వరకు కరెక్టే కానీ, కళ్యాణ్ రామ్ ఇంకా పూర్తి కన్సెంట్ ఇవ్వలేదని అంటున్నారు. కానీ ఆ దర్శకుడు ఉత్సాహంతో గట్టి ప్రయత్నం చేస్తున్నారని బోగట్టా.