సోషల్ మీడియాలో తాజాగా అత్యంత ట్రెండింగ్ పోస్ట్ ఏదైనా ఉందా అంటే… అది నిహారిక కొణిదెల పెట్టినదే అని చెప్పక తప్పదు. జొన్నలగడ్డ చైతన్యతో నిహారికకు గత నెలలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.
సహజంగా పెళ్లి తర్వాత వెండితెరకు నిహారిక దూరమవుతారని ఆమె అభిమానులు నిరాశ చెందారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఎప్పట్లానే నిహారిక మరింత రెట్టించిన ఉత్సాహంతో కెరీర్‌లో బిజీ అయ్యారు. దీన్ని బట్టి చైతన్య ప్రోత్సాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట …వారం రోజులు అక్కడ తెగ ఎంజాయ్ చేసి వచ్చింది. అనంతరం యాంకర్ అనసూయ భరద్వాజ్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను కూడా నిహారిక సీరియస్‌గా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నిహారిక చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఐ లవ్ యూ బంగారూ …అంటూ నిహారిక ఎంతో ప్రేమగా పోస్టు చేశారు. కానీ ఇది చైతన్యను ఉద్దేశించి మాత్రం కాదు. బావ వైష్ణవ్ తేజ్‌కు నిహారిక మనస్ఫూర్తిగా తెలిపిన శుభాకాంక్షలు.
తాజాగా వచ్చిన ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్ పుట్టిన రోజు జనవరి 13. పుట్టిన రోజును పురస్కరించుకుని ఐ లవ్ యూ బంగారు.. నీకు తెలుసు నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో.. లవ్ యూ వైష్ గా అంటూ నిహారిక పోస్టు పెట్టారు.
వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరుసకు బావలైనప్పటికీ …అన్నయ్యలగానే ఆమె భావిస్తారు. వారు కూడా నిహారికను సోదరిగా ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచి అంతా కలిసే పెరగడంతో వాళ్ల మధ్య బలమైన ప్రేమానుబంధాలున్నాయి.