ఈ వారం రెండు సినిమాలు గట్టి పోటీతో విడుదలవుతున్నాయి. రెండింటికీ ఇద్దరు పేరున్న దర్శకులు పని చేస్తున్నారు. స్కంద, పెదకాపు. ఈ రెండు సినిమాల ఫలితానికి కాస్త సంబంధం వుంది. అసలు ఈ రెండు సినిమాలే కాస్త జమిలిగా పెనవేసుకున్నట్లు వుంటాయి. ఎలా అన్నది చూద్దాం.
పెదకాపు నిర్మాత.. దర్శకుడు బోయపాటికి మిత్రుడు. పైగా బోయపాటితో రెండు సినిమాలు తీసినవారు. అంతే కాదు, పెదకాపు సినిమా పోస్టర్లు చూస్తే అదేదో బోయపాటి సినిమా మాదిరిగానే వుంటుంది. కానీ ఆ సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
స్కంద సినిమాకు నిర్మాత చిట్టూరి శ్రీను. ఆయన కూడా బోయపాటికి బాగా దగ్గర. ఎలా అంటే ఇద్దరూ రూమ్ మేట్స్ ఒకప్పుడు. స్కంద సినిమా నుంచి వచ్చిన ట్రయిలర్ లు, కంటెంట్ చూస్తే, కొన్ని సీన్లు బోయపాటి సీన్లలా కాకుండా పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ స్టయిల్ లో వుంటాయి. అది వేరే సంగతి.
ఇవన్నీ ఇలా వుంచితే పెదకాపు, స్కంధ సినిమాల రిజల్ట్ కోసం వేరే సంస్థ చాలా ఇంట్రస్టింగ్ గా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు దర్శకులు తమ తమ తరువాత సినిమాలను ఆ సంస్థతో చేయాల్సి వుంది. అదే అల్లు అరవింద్ గీతా సంస్థ.
బోయపాటి-అల్లు అరవింద్ కానీ శ్రీకాంత్ అడ్డాల-గీతా కానీ లాంగ్ పెండింగ్ డ్యూ. బోయపాటి కోసం తమిళ హీరో సూర్య ను సెట్ చేసి వుంచారు. గీతాకు ఓకె కానీ హిట్ పడకపోతే సూర్య ముందుకు వస్తారా అన్నది అనుమానం. శ్రీకాంత్ అడ్డాల కథ రెడీగా వుంది. కానీ హిట్ పడితే తప్ప గీతా సంస్థ ముందుకు రాదు.
ఇలా మొత్తం మీద స్కంద, పెదకాపు సినిమాలు రెండూ హిట్ కావాలి. బోయపాటి, శ్రీకాంత్ అడ్డాల గీతా సంస్థలో చెరో సినిమా చేయాలి.