
టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్ట్ పురం గజదొంగ. ఇతగాడి కథను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వంశీ. నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ వెరైటీగా రాజమండ్రి గోదావరి మధ్యలో జరిగింది. ఓ ప్రత్యేకరైలును డిజైన్ చేసి, దానిని గోదావరి బ్రిడ్జి మీదకు తీసుకువచ్చి, సినిమాలో చూపించే రాబరీ సీన్ ను రీక్రియేట్ చేసి, మొత్తం డిఫరెంట్ గా ప్లాన్ చేసారు. ఆ తరువాత హీరో రవితేజ ఎలా వుంటాడు టైగర్ నాగేశ్వరరావు మాదిరిగా అన్నది రిలీజ్ చేసారు. అయిదారు లాంచీలు, రెండు మూడు పంట్లు ఇలా భారీ సెటప్ తో ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం విశేషం.
ఫస్ట్ లుక్ విడుదల అనంతరం దర్శక, నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.
నాలుగేళ్ల పాటు చాలా కష్టనష్టాలకు ఓర్చి, బోలెడు ఖర్చు చేసి ఈ సినిమా ను నిర్మించామని నిర్మాత అభిషేక్ అగర్వాల్ అన్నారు. ఈ సినిమా నిర్మిస్తుంటే కొన్ని బెదరింపులు కూడా వచ్చాయన్నారు. అన్నింటికీ తట్టుకుని ఈ సినిమాను జనం ముందుకు తీసుకువస్తున్నామన్నారు. సినిమా నిర్మాణం కోసం గోదావరి రైల్వే బ్రడ్జి, రైలు ఇలా భారీ సెట్లు వేయాల్సి వచ్చిందని దర్శకుడు వంశీ అన్నారు. ఈ సినిమాకు ఎన్ని డబ్బులు వస్తాయన్నది తాను చెప్పలేను కానీ, రవితేజ ఫ్యాన్స్ ఆకలి మాత్రం పూర్తిగా తీరుస్తుందన్నారు.
టైగర్ నాగేశ్వరరావు దేశంలోని అనేక ప్రాంతాల్లో జనాలకు సాయం చేసారని, అవన్నీ బయటకు రాలేదని, ఈ సినిమాలో అవన్నీ చూపించామని అన్నారు. రాబిన్ హుడ్ మాదిరిగానా అని అడిగితే,,దాదాపు అలాగే అనుకోవచ్చు అన్నారు. టైగర్ నాగేశ్వరరావు సమకాలీన గజదొంగల పాత్రలు కూడా సినిమాలో వుంటాయన్నారు.సినిమాలో రవితేజ కనిపించరు అని, టైగర్ నాగేశ్వరరావులో రవితేజ మాత్రమే కనిపిస్తారని అన్నారు.
టైగర్ నాగేశ్వరరావుకు సంబంధించి ఓ చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేసారు. జింకని వేటాడే పులిని చూసుంటావు.. పులిని వేటాడే పులిని చూశావా` అంటూ.. ఈ గ్లిమ్స్ లో ఓ పవర్ ఫుల్ డైలాగు వేసారు ఇచ్చాడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త ఇంపాక్ట్ కలిగించింది. నపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబరు 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా