ఇదిగో మీటింగ్..అదిగో డేట్

టాలీవుడ్ లో నిర్మాతల మండలి, ఫిల్మ్ చాంబర్ లాంటివి వున్నాయి. కానీ వాటిల్లో మాట చెల్లడం లేదనో, జనాలు ఎక్కువైపోయారనో, మొత్తం మీద యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనే బాడీ ఒకటి పుట్టుకువచ్చింది.  Advertisement…

టాలీవుడ్ లో నిర్మాతల మండలి, ఫిల్మ్ చాంబర్ లాంటివి వున్నాయి. కానీ వాటిల్లో మాట చెల్లడం లేదనో, జనాలు ఎక్కువైపోయారనో, మొత్తం మీద యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనే బాడీ ఒకటి పుట్టుకువచ్చింది. 

ఇప్పుడు ఇక్కడా లుకలుకలు బయలుదేరాయని వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమందినే కూడగడతున్నారని, కొంత మందిని విస్మరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల సిఎమ్ దగ్గరకు డెలిగేషన్ వెళ్లినపుడు భీమ్లానాయక్ నిర్మాతలను తీసుకెళ్లలేదు. కారణం తెలియదు. పవన్ సినిమా నిర్మాత అని అనుకుంటే, ఆ లెక్కన దిల్ రాజు సినిమా పవన్ తో నిర్మించారు. మైత్రీ నవీన్ నిర్మించబోతున్నారు. వాళ్లు వెళ్లారు. వీళ్లకు మాత్రం పిలుపు లేదు. అలాగే చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి కూడా భీమ్లానాయక్ నిర్మాతలను పిలవకపోవడం విశేషం.

సరే ఈ సంగతి అలా వుంచితే నిన్నటికి నిన్న గిల్డ్ మీటింగ్ ప్లాన్ చేసారు. సినిమాల విడుదల డేట్ లు సమస్యగా మారుతోంది కనుక, గిల్డ్ లో జనాలతో ఓ కమిటీ వేసి, ఆ కమిటీ నిర్ణయం మేరకు డేట్ లు నిర్ణయించాలన్నది ప్లాన్. ఈ మేరకు ముందు రోజు అందరికీ సమావేశం గురించి సమాచారం వెళ్లింది.

కానీ సమావేశం జరగడానికి సరిగ్గా ఒక గంట ముందు పుష్ప డేట్ ను ప్రకటించేసారు. ఆ తరువాత నిర్మాతలు మీటింగ్ కు హాజరయ్యారు. దీంతో చాలా మంది గిల్డ్ సభ్యులు, ఇలా చేయడం ఏమిటీ అని చెవులు కొరుక్కుంటున్నారు.