Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇక కొన్నాళ్లు సినిమాలకు విరామం

ఇక కొన్నాళ్లు సినిమాలకు విరామం

ఆంధ్రలో పూర్తిగా ఎన్నికల వాతావరణం అలుముకుంది. దాంతో సినిమాలు థియేటర్ కు దూరంగా వున్నాయి. సినిమాలు సరైనవి లేక జనాలు థియేటర్ కు దూరంగా వున్నారు.

మార్చి నెలాఖరు, ఏప్రిల్ తొలివారం రెండు అద్భుతమైన విడుదల తేదీలు. ఆ రెండింటికి టిల్లు స్వ్వేర్, ప్యామిలీ స్టార్ ప్లాన్ చేసారు. ఇక మిగిలిన ఏప్రియల్ నెల, మే మొదటి వారం వరకు చిన్న చిన్న సినిమాలు అన్నీ ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్లే టిల్లు స్క్వేర్ పెద్ద హిట్ అయింది. ఫ్యామిలీస్టార్ డిజాస్టర్ గా మిగిలింది. అప్పటికే జనాలకు సినిమా మూడ్ వెళ్లిపోయింది. దాంతో విడుదలైన చిన్న సినిమాలకు కూడా పెద్దగా కలెక్షన్లు లేవు. ఒక్కో ఆటకు పదివేలు, ఇరవై వేలు మాత్రమే వస్తున్నాయి. ఎంత షేరింగ్ మీద ఆడినా కూడా పెద్దగా మిగిలేది ఏమీ వుండదు.

నిజానికి ఈవారం, వచ్చేవారం చాలా సినిమాలే విడుదల జాబితాలో వున్నాయి. కానీ వాటిలో చాలా వరకు సినిమాలు ఎప్పుడు తీసారో కూడా తెలియనంత దూరంలో వున్నాయి. ఏదో తీసాము, విడుదల చేసేయాలి కదా అని చేస్తున్నట్లు కనిపిస్తోంది తప్ప వేరు కాదు. కాస్తా ప్రామినెంట్ పేర్లు, పబ్లిసిటీ వున్న సినిమా ఒకటి ఈ మధ్య విడుదలైతే, నైజాంలో ఆ సినిమాకు షో కి అరడజను మంది కూడా వుండడం లేదు. ఇక మిగిలిన సినిమాల పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోవడమే.

టిల్లు స్క్వేర్ ఎంత దులపాలో అంతా దులిపేసింది. రంజాన్ సెలవుల్లో కూడా కాస్త అక్కడక్కడ ఫుల్స్ కనిపించాయి. తరువాత అది కూడా తగ్గిపోయింది. ఇక ఇప్పుడు థియేటర్లు ఖాళీగానే కనిపిస్తోంది. అందువల్ల కాస్త ఆడుతాయి అనుకున్న సినిమాలు ఏవీ విడుదలకు రెడీ కావు. ఎన్నికల తరువాత మళ్లీ థియేటర్లలోకి సినిమాలు వచ్చేది. అప్పటి వరకు సినిమాలకు విరామం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?