సోషల్ మీడియాలో తారలు పోస్టు చేసే చాలా ఫొటోలు ఎడిట్ కు గురి అయినవే. ఆ ఎడిటింగ్ లో బాడీ ఫీచర్లను మార్చకపోయినా, లైటింగ్ లలో మార్పు చేర్పులతో మొత్తం లుక్, అప్పీరియన్స్ ను మార్చేస్తారు. సెలబ్రిటీలే కాదు, సామాన్యులు కూడా సోషల్ మీడియా లో పోస్టు చేసే ఫొటోలకు లైటింగ్, కలర్ అడ్జస్ట్ మెంట్లతో తమను తాము అందంగా ప్రజెంట్ చేసుకుంటూ ఉంటారు.
కంప్యూటర్, ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లోనే ఇప్పుడు బోలెడు రకాల ఫిల్టర్ ఎడిటింగ్ ఆప్షన్లున్నాయి. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాల్లో అయితే.. ప్రత్యేకించి ఇన్ స్టాలో వాస్తవ చిత్రాలకు రంగులద్దే ఎన్నో ఫిల్టర్లున్నాయి. వాటిని ఉపయోగించి తమ సాదాసీదా ఫొటోలను కూడా అందంగా మార్చుకోవచ్చు. .జనాలకు ఇదొక సరదా.
మరి ఇలాంటి ఫీచర్లను సినిమా వాళ్లు కూడా ఎంచక్కా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అందమైన లొకేషన్లలో, అందమైన డిజైనర్ వేర్ లలో ఫొటోలు దిగి పోస్టు చేసే హీరోయిన్లు తమ ఫొటోలకు ఫిల్టర్ ల ద్వారా తుదిమెరుగులు అద్దుతారు.
ఒకరని కాదు.. ఇన్ స్టాలో హీరోయిన్లు, హీరోలు పోస్టు చేసే పిక్స్ లో నూటికి 90 శాతం కూడా ఫిల్టర్లలో మార్పు చేర్పులకు గురి అయినవే! ఎప్పుడో అరుదుగా మాత్రమే నో మేకప్ అంటూ తారలు ఫొటోలు పెడతారు. వాటిని కూడా ఫిల్టర్ల ద్వారానే పోస్టు చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఫిల్టర్ల ఫొటోల మధ్యన నో ఫిల్టర్ అంటూ ఫొటోలను పోస్టు చేస్తున్న తార పేరు చెప్పాలంటే ఇలియానా పేరునే చెప్పాలి.
ఇలియానా పోస్టు చేసే బీచ్ పిక్స్ లో చాలా వరకూ వితౌట్ ఫిల్టర్స్ వీడియోలే ఉంటాయి. తన శరీర ఛాయ కానీ, తన మొహం రూపు రేఖలు మార్పుల్లేకుండా ఫిల్టర్లను వాడకుండా పొటోలును పోస్టు చేసే గట్స్ ను ఇలియానా ప్రదర్శిస్తూ ఉంటుంది. చాలా మంది హీరోయిన్లకు ఇంత డేర్ నెస్ ఉన్నట్టుగా లేదు!