Advertisement

Advertisement


Home > Movies - Movie News

చరణ్ కు 4వ ర్యాంక్.. తారక్ కు 8వ ర్యాంక్

చరణ్ కు 4వ ర్యాంక్.. తారక్ కు 8వ ర్యాంక్

ఈ ఏడాది టాప్ ర్యాంక్ లో ఎవరుంటారు? పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టిన ఎన్టీఆర్-తారక్ లో ఎవరో ఒకరు ఉండాలి. లేదంటే యష్, ఇంకా లేదంటే అల్లు అర్జున్ ఉండాలి. కానీ IMDb రేటింగ్‌లు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. హీరోహీరోయిన్లకు అభిమానులు ఇచ్చే రేటింగ్‌ల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. వీళ్ల పేజీల్లో నమోదుచేయబడిన ఫ్యాన్ వ్యూస్ సంఖ్య ఆధారంగా ర్యాంకులు నిర్ణయించారు.

అలా 2022 సంవత్సరానికి గాను నంబర్ వన్ స్థానంలో నిలిచిన హీరో ధనుష్. కొన్ని తమిళ సినిమాలు చేయడం తప్ప, యష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లా పాన్ ఇండియా లెవెల్లో మెరవలేదు ధనుష్. కానీ ఆశ్చర్యంగా నంబర్ వన్ ర్యాంక్ లోకి వచ్చాడు. దీనికి కారణం ఎక్కువమంది అతడి పేజీని విజిట్ చేయడమే.

ఈ లెక్కన చూసుకుంటే.. రెండో స్థానంలో అలియాభట్, మూడో స్థానంలో ఐశ్వర్య రాయ్ నిలిచారు. అలియా భట్ ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర సినిమాలు చేసింది. ఐష్ మాత్రం కేవలం పీఎస్1 మాత్రమే చేసింది. అయినప్పటికీ మూడో స్థానం దక్కింది.

ఇక లిస్ట్ లో రామ్ చరణ్ నాలుగో స్థానంలో నిలవగా, ఎన్టీఆర్ 8వ స్థానానికి పరిమితమయ్యాడు. 2022 సంవత్సరానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్-10 జాబితా ఇలా ఉంది. టాప్-10 లిస్ట్ లో సౌత్ డామినేషన్ మాత్రం స్పష్టంగా కనిపించింది. 

1. ధనుష్, 2. అలియా భట్, 3. ఐశ్యర్య రాయ్, 4. రామ్ చరణ్, 5. సమంత, 6. హృతిక్ రోషన్, 7. కియరా అద్వానీ, 8. ఎన్టీఆర్, 9. అల్లు అర్జున్, 10. యష్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?