పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి విడుదల అనేసరికి సినిమా పెద్దలు అనేకమంది లోలోపలే గొంతు చించేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మేకర్లతో, డైరక్టర్ తో, హీరోలు ఇద్దరితో అనేక బంధాలు వున్న వారంతా భీమ్లా నాయక్ వెనక్కు వెళ్లొచ్చు కదా అని సుద్దులు చెబుతున్నారు.
నిజానికి ఉరుములేని పిడుగులా వచ్చి పడింది ఆర్ఆర్ఆర్. తమ సినిమా వస్తే ఎవరైనా తప్పుకుంటారు అనే వెర్రి ధీమా. కానీ భీమ్లా నాయక్ దానికి తలవంచడం లేదు. దాంతో కొత్త రాగం అందుకున్నారు.
ఇండస్ఠ్రీ కోసం సపోర్ట్ చేయాలి కదా అంటూ? దీనికి ఆల్రెడీ పవన్ నిర్మొహమాటంగా తన నిర్మాతలు నాగవంశీ, నవీన్, రవిశంకర్ తదితరుల మధ్య నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్పేసినట్లు తెలుస్తోంది.
తన సినిమా వకీల్ సాబ్ ను ఇబ్బందులకు గురి చేసినపుడు ఏ ఇండస్ట్రీ సపోర్ట్ చేసింది? ఏ ఇండస్ట్రీ జనాలు గొంతు విప్పారు…అలాంటపుడు తాను మాత్రం ఎందుకు సపోర్ట్ చేయాలి అన్నది పవన్ భావనగా తెలుస్తోంది. అందుకే ఎవరు ఎంత గోల చేసినా భీమ్లా నాయక్ విడుదల జనవరి 12 అన్నది గట్టిగా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో పవన్ తలుచుకుంటే తప్ప వాయిదా అన్నది వుండదు. పైగా ఫ్యాన్స్ కూడా గట్టిగా పట్టుకు కూర్చున్నారు. ట్విట్టర్ లో, ట్విట్టర్ స్పేసెస్ లో ఈ మేరకు ఫ్యాన్స్ తెగ ఊగిపోతున్నారు. ఇప్పుడు వాయిదా అంటే నిర్మాతల ఆఫీసు దగ్గర ధర్నా చేసేలా వున్నారు వారంతా.