Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇంకా రాకుండానే ట్రోలింగ్ నా?

ఇంకా రాకుండానే ట్రోలింగ్ నా?

ఫ్యాన్స్ వ్యవహారాలు రాను రాను వెర్రితలలు వేస్తున్నాయి. ఒక హీరో సినిమా వస్తోంది అంటే పది మంది అపోనెంట్ హీరోల ఫ్యాన్స్ ట్రొలింగ్ మొదలు పెట్టేస్తున్నారు. ఆ తరువాత మరో హీరో వంతు. ఇలా ట్రోలింగ్ అన్నది వెర్రితలలు వేస్తోంది. 

ఒకప్పుడు సంగీత దర్శకుడు థమన్ కు ఈ ట్రోలింగ్ ఎక్కువగా వుండేది. కానీ వున్నట్లుండి సోషల్ మీడియాలో థమన్ కు అనుకూలంగా పలు అక్కౌంట్లు స్టార్ట్ అయ్యాయి. థమన్ ఇప్పుడు సోషల్ మీడియా కింగ్ అయిపోయారు. దాని వెనుక మ్యాజిక్ ఏమిటన్నది ఎవరికీ తెలియదు. ఆ మ్యాజిక్ ఎంత అంటే, సర్కారు వారి పాట బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిగ్గా ఇవ్వలేదని మహేష్ ఫ్యాన్స్ కాస్త గడబిడ చేద్దాం అనుకున్నా, అది కనిపించకుండా చేసేంత. మహేష్ తన తరువాత సినిమాకు థమన్ వద్దు అని చెప్పినా, త్రివిక్రమ్ ఏదో కిందా మీదా పడినా, అదంతా బయటకు రానంత.

కానీ దేవీశ్రీ ప్రసాద్ విషయంలో ఇది రివర్స్ లో వుంది. దేవీ తన ప్రొఫెషన్ ను కాస్త నిర్లక్ష్యం చేస్తున్నారన్నది వాస్తవం. సుకుమార్ మినహా మిగిలిన వారి సినిమాలకు సరైన వర్క్ అందివ్వడం లేదు అన్నది రుజువైన సంగతి. దిల్ రాజు కీలకమైన సినిమా రౌడీ బాయిస్ కు కూడా దేవీ అన్యాయం చేసాడని టాక్ బలంగా వుంది.

పుష్ప సినిమాకు దేవీ అన్నీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. కానీ ప్రతి పాట విడుదల టైమ్ లో భయంకరంగా ట్రోలింగ్ తప్పలేదు. ఊ..అంటావా సాంగ్ టైమ్ లో అయితే ఎక్కడి నుంచి కాపీ కొట్టాడో మూలాలు వెదికి మరీ ట్రోల్ చేసారు. కానీ ఆ పాట భయంకరమైన హిట్ అయింది. ఆ తరువాత సరైన ఆల్బమ్ లేదు.

ఇప్పుడు లేటెస్ట్ గా వాల్తేర్ వీరయ్య సినిమా వస్తోంది. తొలిపాట టీజర్ వదిలారు. దాంతో మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. సరే, పాట బాగుంటుందా? వుండదా? అన్నది విడుదలయ్యాక కానీ తెలియదు. అయితే ముందుగానే ట్రోలింగ్ అంటే కాస్త అనుమాన పడాల్సిందే. గమ్మతేమిటంటే దేవీ కూడా ఇవేవీ పట్టించుకోవడం లేదు. తన కెరీర్ మీద తనకే శ్రద్ద వుందో లేదో కూడా తెలియదు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?