ఎంత బాగా నవ్వించగలిగితే అంత హిట్ గ్యారంటీ..ఇదీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్. బ్యానర్ దన్ను వుంటాలి అన్నది కండిషన్ అప్లయ్. జాతిరత్నాలు, మత్తు వదలరా లాంటి సినిమాలు క్లాసిక్ ఉదాహరణలు.
మత్తువదలరా సినిమా నిర్మించిన క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ను తోడు చేసుకుని నిర్మించిన మరో చిన్న సినిమా ‘హ్యాపీ బర్త్ డే’. వెన్నెల కిషోర్, సత్య, లావణ్య త్రిపాఠీ తదితరులు నటించిన ఈ సినిమాకు రితేష్ రానా దర్శకుడు.
మత్తువదలరా తరువాత అతగాడు చేస్తున్న మరో సినిమా ఇది. ఇంటింటికీ తుపాకీ అనే చిత్రమైన బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతాడు మంత్రిగా నటించిన వెన్నెల కిషోర్. దాని పర్యవసానం ఎలా వుంటుంది అన్నది ఫన్ గా డీల్ చేసినట్లు కనిపిస్తోంది. ఇంటింటికి గన్ను..టోటల్ ఫన్ అనే స్లోగన్ ను చెప్పడం ద్వారా కాన్సెప్ట్ ను కూడా రివీల్ చేసారు.
జూలై 15న విడుదలయ్యే ఈ సినిమాకు కీరవాణి కాలభైరవ సంగీతం అందించారు. అవుట్ అండ్ అవుట్ ఫుల్ క్రేజీ కామెడీ జానర్ లో సినిమాను తీసినట్లు వుంది.