ఇటీవల కథా నాయికలు విలన్ పాత్ర పోషించడానికి ఉత్సాహం చూపుతున్నారు. హీరోలు విలనిజాన్ని ప్రదర్శించడం చూశాం. కానీ మనకెప్పుడూ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల ఆలోచన రీతిలో మార్పు వచ్చింది. హీరోయిన్ రెజీనా “ఎవరు” సినిమాలో ప్రతి నాయిక పాత్ర పోషించి మెప్పించారు. రెజీనాను మరో హీరోయిన్ అనుసరిస్తున్నారు.
ప్రతి నాయిక పాత్ర పోషించడానికి మరో హీరోయిన్ అదితిరావ్ హైదరీ. నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “వి” సినిమాలో అదితి రావ్ హైదరీ విలన్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి కథానాయికలుగా నటిస్తున్నారు.
“వి” చిత్రంలో నాని ప్రతి నాయకుడిగా నటిస్తున్నారని సమాచారం. నాని సరసన అదితి కూడా ప్రతి నాయిక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. మరో వైపు సుధీర్, నివేదా థామస్ జంటగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిసింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ అదితి ప్రతినాయిక పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా నొప్పిస్తుందా అనేది తేలాల్సి ఉంది.
కాగా ఈ సినిమాను దిల్‌రాజ్ నిర్మిస్తున్నాడు. తెలుగు సంవత్సరాది ఉగాని పురస్కరించుకుని గత నెల 25న సినిమా విడుదల చేయాల్సి ఉండింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు. కరోనా అనంతరం సినిమా విడుదల ఎప్పుడనేది చెప్పనున్నారు.