Advertisement

Advertisement


Home > Movies - Movie News

జగన్ ...వదల'బొమ్మా'ళీ

జగన్ ...వదల'బొమ్మా'ళీ

అనుకున్నట్లే అయింది. సింగిల్ జడ్జ్ తీర్పుతో సినిమా టికెట్ ల జీవో 35ను కొట్టేసినా, ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని వదిలిపెట్టడం లేదు. సింగిల్ జడ్జ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజినల్ బెంచ్ ను ఆశ్రయించింది. అయితే కేసును రేపటికి వాయిదా వేసారు. 

అలా అయితే అడ్డగోలుగా రేట్లు పెంచి అమ్మేస్తారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తేగా, అలా అయితే రేపు ఫస్ట్ కేసుగా తీసుకుని విచారిద్దామని సమాధానం వచ్చింది. అంటే రేపు ఉదయం డివిజినల్ బెంచ్ తీర్పుపై వ్యవహారం ఆధారపడి వుంటుంది.

నిజానికి జివో 35ను విడుదల చేసారే కానీ ప్రభుత్వం దాన్నిసమర్థంగా అమలు చేయడంలో పూర్తిగా విపలం అయింది. ఈ విషయంలో అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా పని చేసిందనే చెప్పాలి. చాలా చోట్ల 150, 100 యూనిఫారమ్ రేట్లకు టికెట్ లు అమ్మేసినా పట్టించుకున్నవారే లేరు.

ఇక ఆ మాత్రం దానికి ఆ జీవో మీద సిఎమ్ జగన్ కు పట్టుదల ఎందుకో? ఇప్పుడు అనుకూలంగా వచ్చినా, ఇష్టం వచ్చినట్లు రేట్లు అమ్ముతారు. అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తారు? అవసరమా ఇదంతా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?