యంగ్ హీరో నాగశౌర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ అశ్వద్ధామ. బర్నింగ్ ప్రోబ్లమ్ ను తీసుకుని, వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఐరా క్రియేషన్స్ బ్యానర్ మీద ఉష మాల్పూరి నిర్మించిన సినిమా ఇది. పక్కా స్ట్రిక్ట్ టు ది జోనర్ అన్నట్లుగా, పకడ్బందీ స్క్రిప్ట్ తో ఈ సినిమాను తయారుచేస్తున్నారు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన మెహరీన్ నటిస్తోంది. రమణతేజ అనే కొత్త దర్శకుడు అందించిన లైన్ ఆధారంగా ఐరా క్రియేషన్స్ సంస్థ తయారుచేసుకున్న స్క్రిప్ట్ తో ఈ సినిమా రెడీ అవుతోంది.
ఎయిర్ టెల్ 4జి మోడల్ షర్గన్ కౌర్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఛలో సినిమాతో మాంచి హిట్ కొట్టిన ఐరా సంస్థను ఆ తరువాత వచ్చిన నర్తనశాల కాస్త డిస్సపాయింట్ చేసింది. దాంతో మళ్లీ బ్యానర్ వాల్యూ నిలబడేలా, శౌర్యకు మంచి హిట్ పడేలా జాగ్రత్తలు తీసుకుంటూ శంకర్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మరో విశేషం ఏమిటంటే, బలమైన టెక్నికల్ టీమ్ పనిచేయడం. కెజీఎఫ్ లాంటి సినిమాకు పనిచేసిన స్టంట్ మాస్టర్లు పనిచయడం ఈ సినిమామీద చేస్తున్న ఖర్చుకు నిదర్శనం. ఇప్పుడు ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అన్ని విధాలా డేట్లు లాక్ అయిపోయాయి. అందువల్ల మరీ ఆలస్యం చేయకుండా ఈ డేట్ ను అశ్వద్ధామ కోసం లాక్ చేసారు.
ఛలో సినిమా ఫిబ్రవరి 2న విడుదలై పెద్ద హిట్ అయింది. అదే సెంటిమెంట్ తో ఆ డేట్ కు దగ్గరగా అశ్వద్ధామ విడుదల డేట్ డిసైడ్ చేసారు.