Advertisement

Advertisement


Home > Movies - Movie News

జూలై లో చైతన్య 'థాంక్యూ'

జూలై లో చైతన్య  'థాంక్యూ'

నాగ్  చైతన్య...విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన సినిమా థాంక్యూ... ఓ మాంచి ఫీల్ గుడ్ పాయింట్ చుట్టూ కథ అల్లుకుని నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ఏనాడో రెడీ అయిపోయింది. 

సరైన డేట్ కోసం చూస్తూ వెయిటింగ్ లో వుంది. ఇప్పడు డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు. జూలై 8న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. 

జీవితంలో సాయం చేసిన వారందరికీ ఓ యువకుడు థాంక్స్ ఎలా చెప్పాడు అన్న పాయింట్ చుట్టూ అల్లిన కథ అని తెలుస్తోంది. విక్రమ్ కే కుమార్ కు పి సి శ్రీరామ్, నవీన్ నూలి తోడయ్యారు. సంగీత దర్శకుడు థమన్ తొలిసారి విక్రమ్ కే కుమార్ తో కలిసి పని చేస్తన్నారు. రాశీఖన్నా...మాళవిక నాయర్ కథానాయకలు

చైతన్య సినిమాల్లో కాస్త గ్యాప్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఫినిష్ చేసి వెబ్ సిరీస్ ను కూడా కంప్లీట్ చేస్తున్నాడు. అలాగే హిందీ సినిమా వర్క్ ఫినిష్ చేసాడు. దాని తరువాత పరుశురామ్ తో సినిమా ప్లానింగ్ లో వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?