తమిళ స్టార్ హీరో సూర్య, ఆయన భార్య- నటి జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్నాళ్లుగా గట్టి ప్రచారమే జరుగుతూ ఉంది. చాలామంది సినిమా వాళ్ల లాగానే ఈ జంట కూడా విడిపోబోతోదంటూ రూమర్లు షికారు చేశాయి. దీనికి ఆధారంగా జ్యోతిక ముంబైకి షిఫ్ట్ కావడాన్ని ప్రస్తావనకు వచ్చింది.
జ్యోతికకు ఇంకా నటన మీద ఆసక్తి ఉందని, అయితే సూర్య తల్లిదండ్రులకు ఇది ఇష్టం లేదని .. దీంతో కుటుంబంలో విబేధాలు అనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై గతంలోనే జ్యోతిక స్పందించింది. తన పిల్లల కోసం తను ముంబైలో ఉండాల్సి వస్తోందంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆమె కెరీర్ లో బిజీ అవుతూ ఉండటం, వరసగా సినిమాలు చేస్తూ ఉండటంలో విడాకుల రూమర్లు ఆగలేదు!
ఈ నేపథ్యంలో వీటన్నింటికీ చెక్ పెట్టేలా తమ తాజా టూర్ విశేషాలను ఇన్ స్టాలో షేర్ చేసింది జ్యోతిక. సూర్యతో కలిసి దిగిన సెల్ఫీ వీడియోను ఆమె పోస్టు చేసి.. తమ సఖ్యతను చాటింది. విడాకుల రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ.. 2024 ట్రావెల్ జర్నీని మొదలుపెట్టినట్టుగా ప్రకటించింది.
ఇటీవలే కాదల్- ది కోర్ సినిమాలో జ్యోతిక నటించింది. మమ్ముట్టీ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాలో జ్యోతిక నటన ప్రశంసలు అందుకుంది. సినిమా చూస్తున్నంతసేపూ ఎక్కడా జ్యోతిక గుర్తురాదు, అంత బాగా ఆ పాత్రను ప్రజెంట్ చేసింది జ్యోతిక. ఆమె నటించిన బాలీవుడ్ సినిమా షైతాన్ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఇతర సినిమాలతో కూడా ఆమె బిజీగా ఉంది.