cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కాజల్ నుంచి మరో హారర్ సినిమా

కాజల్ నుంచి మరో హారర్ సినిమా

హారర్ జానర్ అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదని గతంలో చాలాసార్లు చెప్పుకొచ్చింది కాజల్. అయినప్పటికీ ఓ నటిగా అన్ని రకాల కథలు చేయాలి కాబట్టి, హారర్ జానర్ లో ఓ వెబ్ సిరీస్ చేసింది. 

బహుశా.. మరోసారి ఈ జానర్ లో నటించనేమో అని కూడా ప్రకటించింది. కట్ చేస్తే, కాజల్ మరో హారర్ కథకు ఓకే చెప్పింది. ఈసారి ఏకంగా సినిమానే.

డీకే దర్శకత్వంలో కాజల్ ఓ హారర్ సినిమా చేసింది. ఆమె పార్ట్ షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో కాజల్ తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు. వాళ్లే రెజీనా, రైజా విల్సన్, జనని. వీళ్లు నలుగురు లీడ్ రోల్స్ గా హారర్ సినిమా తెరకెక్కుతోంది.

సినిమాకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది. పరిస్థితులు అనుకూలిస్తే థియేటర్లలోకి వస్తుంది. లేదంటే డైరక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. 

ఓటీటీలోకి వస్తే మాత్రం కాజల్ నటించిన రెండు హారర్ కథలు ఓటీటీలోకి వచ్చినట్టవుతుంది. సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×