టి కాజోల్ , తన భర్త అజయ్ దేవగణ్‌తో కలిసి నటించిన ‘తానాజీ’ చిత్రం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘తానాజీ’ ప్రమోషన్స్‌లో దంపతులైన ఇద్దరు నటులు బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా కాజోల్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు.
25 సంవత్సరాలుగా అజయ్‌తో తాను ‘హల్‌చల్’ చేస్తున్నట్టు అందరినీ కవ్విస్తూ మాట్లాడుతున్నారామె. అదెలా అని ఆలోచిస్తున్న వారికి ఎక్కువ సమయం ఇవ్వకుండా వివరాలన్నీ తానే చెబుతోంది. 25 పంవత్సరాల క్రితం ‘హల్‌చల్’ చిత్రం షూటింగ్‌లో అజయ్‌తో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పారామె. అలా హల్‌చల్‌తో పరిచయం స్నేహంగా మారి, తర్వాత ప్రేమ, పెళ్లికి దారి తీశాయని చకచకా జీవిత విశేషాలను ఆమె కథగా చెబుతున్నారు.
అన్నట్టు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ఆమె తడుముకోకుండా చెప్పారు.
‘అజయ్‌తో పరిచయం నాటికే నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో నాకు మనస్పర్థలు వచ్చాయి. అతనితో ఎక్కువ రోజులు స్నేహం కొనసాగలేదు. విడిపోయాం. ఆ విషయాన్ని నేను అజయ్‌తో పంచుకున్నాను. నేను, అజయ్ నాలుగేళ్లు డేటింగ్‌లో ఉన్నాం. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం’ అని సరదాగా ఆమె తన వ్యక్తిగత విషయాలను ‘తానాజీ’ ప్రమోషన్స్‌లో భాగంగా పంచుకున్నారు.
‘తానాజీ’ సక్సెక్ కావాలని కోరుకుంటూ కాజోల్ దంపతులకు ఆల్ ది బెస్ట్.