Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈసారి కమల్ హాసన్ ను కూడా కలిపేశాడు

ఈసారి కమల్ హాసన్ ను కూడా కలిపేశాడు

ఇండియన్-2 వివాదం మొన్నటివరకు శంకర్, లైకా ప్రొడక్షన్స్ నిర్మాతల మధ్య మాత్రమే ఉండేది. తమిళనాడు ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఇప్పుడిప్పుడే కాస్త ఫ్రీ అయిన కమల్ హాసన్ ఈ వివాదంపై దృష్టి పెట్టారు. 

తనదైన శైలిలో దీన్ని పరిష్కరించాలని చూస్తున్నారు. అంతలోనే దర్శకుడు శంకర్ చేసిన ఓ పని, వివాదాన్ని మరింత పెంచింది. ఇండియన్-2 సినిమా లేట్ అవ్వడానికి నిర్మాతలతో పాటు కమల్ హాసన్ కూడా ఓ కారణం అంటూ తాజాగా ప్రకటించి మరో సంచలనానికి తెరతీశాడు శంకర్.

శంకర్ పై లైకా ప్రొడక్షన్స్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇండియన్-2 పూర్తయ్యేంత వరకు శంకర్ మరో సినిమా చేయకుండా ఆదేశాలు జారీచేయాలని కోర్టును కోరింది లైకా ప్రొడక్షన్స్. దీనిపై తాజాగా తన వివరణ ఇచ్చారు శంకర్. ఆ వివరణలో సినిమా లేట్ అవ్వడానికి కమల్ కూడా ఓ కారణమని శంకర్ ఆరోపించడం విశేషం.

యూనిట్ లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ తర్వాత మరోసారి షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారట. అయితే అప్పుడు కమల్, మేకప్ ఇరిటేషన్ తో ఇబ్బంది పడ్డారట. కాబట్టి కొన్నాళ్లు షూటింగ్ ఆపేద్దామని కమల్ అన్నారని, ఆ తర్వాత కరోనా విజృంభించడంతో ఇండియన్-2 సినిమా ఆగిపోయిందని శంకర్ తన వివరణలో చెప్పుకొచ్చారు. 

ప్రాజెక్ట్ లేట్ అవ్వడానికి తను ఎంత మాత్రం కారణం కాదని, లైకా ప్రొడక్షన్స్, కమల్ వల్లనే సినిమా లేట్ అయిందంటూ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్నారు. శంకర్ స్టేట్ మెంట్ తో ఇప్పుడీ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. 

ఓవైపు సమస్య పరిష్కరించేందుకు కమల్ ప్రయత్నిస్తుంటే, ఏకంగా అతడి వల్లనే సినిమా లేట్ అంటూ శంకర్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం వివాదాస్పదమైంది. మరోవైపు నటుడు వివేక్ ఆకస్మిక మృతి కారణంగా.. ఇండియన్-2 సినిమాను రీషూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసును జూన్ 4కు వాయిదా వేసింది కోర్టు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?