కాంతారా ముందు గాడ్ ఫాదర్ అవుట్

మెగాస్టార్..బాస్ ఈజ్ బ్యాక్..ఇంత గొప్ప..అంత గొప్ప సినిమా అనిపించుకున్న గాడ్ ఫాదర్ కలెక్షన్లను నైజాంలో ఓ డబ్బింగ్ సినిమా దాటేస్తోంది. మనవాళ్లకు పరిచయం లేని పరాయి రాష్ట్రం హీరో వచ్చి, మెగా సినిమాను పక్కకు…

మెగాస్టార్..బాస్ ఈజ్ బ్యాక్..ఇంత గొప్ప..అంత గొప్ప సినిమా అనిపించుకున్న గాడ్ ఫాదర్ కలెక్షన్లను నైజాంలో ఓ డబ్బింగ్ సినిమా దాటేస్తోంది. మనవాళ్లకు పరిచయం లేని పరాయి రాష్ట్రం హీరో వచ్చి, మెగా సినిమాను పక్కకు నెట్టేస్తున్నాడు. 

నైజాంలో గాడ్ ఫాదర్ అతి కష్టం మీద 12 కోట్లు కలెక్షన్లు రాబట్టడం కష్టం అయింది. అలాంటిది కాంతారా ఇప్పటికే నైజాంలో పదకొండు కోట్లు వసూలు చేసేసింది. మరో నాలుగు కోట్లు అతి సులువుగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అసలు ఇండస్ట్రీ బాస్ అనే కానీ, గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు భీమ్లా నాయక్, సర్కారు వారి పాట కలెక్షన్లలో మూడో వంతు లేవు. అలాంటిది ఇప్పుడు ఓ డబ్బింగ్ సినిమా కూడా దాటేసింది.

ఆంధ్ర లో గాడ్ ఫాదర్ కలెక్షన్లు చూసుకుంటే విశాఖ మొత్తం మీద ఆరు కోట్లు రాబట్టింది. అంటే ఆంధ్ర 25 కోట్ల రేషియో అన్నట్లు అయింది. మరి ఇప్పుడు వాల్తేర్ వీరయ్య ను ఏ రేషియోలో అమ్మాలి. 45 కోట్ల రేషియోలో ఆంధ్ర అంతా అమ్మాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ ఇప్పుడు టఫ్ కాంపిటీషన్ లో వస్తోంది. మరి ఈ లెక్కన 30 కోట్లు లేదా 35 కోట్ల రేషియో అమ్ముతారా?

సోలోగా వస్తేనే పాతిక కోట్ల రేషియో చేయకపోతే టఫ్ కాంపిటీషన్ లో వస్తే ఎంత చేస్తుందో మరి చూడాలి.