సెలబ్రిటీలు ఇప్పుడు కొత్త పిక్చర్స్ ఏమీ చూపించ లేరు. మామూలుగా అయితే సెలబ్రిటీలు వివిధ లొకేషన్లకు వెళ్లి, అందమైన ప్రదేశాలకు వెళ్లి అక్కడ అందంగా ఫొటోలు దిగి వాటిని తమ ఫాలోయర్లకు చూపిస్తూ ఉంటారు. సెలబ్రిటీలు వార్తల్లో ఉండటానికి అలాంటి పిక్చర్స్ ను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు వారికి ఆ అవకాశం లేదు. బయటకు వెళ్లేందుకు, టూర్లకు, షికార్లకూ ఎవరికీ అవకాశం లేదు. ఇలాంటి సమయంలో త్రో బ్యాక్ అంటున్నారు కొంతమంది సెలబ్రిటీలు.
పాత ఫొటోలను పోస్టు చేస్తూ ఉన్నారు. ఎప్పుడో దిగి, తాము దాచి ఉంచిన ఫొటోలను ఇప్పుడు పోస్టు చేస్తున్నారు. పాత ఫొటోల ద్వారా తమ ఫాలోయర్లను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఈ జాబితాలోకే చేరింది కరీనా కపూర్. తన ఫ్యామిలీతో కూడిన ఫొటోను పోస్టు చేసింది కరీనా. అది కూడా ఒక బీచ్ లో దిగిన ఫొటోను పోస్టు చేసింది.
ఈ ఫొటోలో సైఫ్ అలీఖాన్ ఉన్నా, క్యూట్ గా వాళ్ల తనయుడు కూడా ఉన్నా..జనాల చూపులు మాత్రం కరీనా మీదకే వెళ్తున్నాయి. వయసు మీద పడుతున్నా కరీనా అందంచందం మరింత ఇనుమడిస్తోందే తప్ప వన్నె తరగడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ ఫొటో విషయంలో. కరోనా వేళ కరీనా ఇలా హీటెక్కిస్తూ ఉన్న వైనం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.