యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండకు కాస్త ధైర్యం ఎక్కువ. 'ఆర్ఎక్స్ 100' లాంటి న్యూ ఏజ్ సినిమా చేసారు. తర్వాత 'గ్యాంగ్ లీడర్'లో స్టయిలిష్ విలన్‌గా నటించారు. . 'చావు కబురు చల్లగా' వంటి వైవిధ్యమైన సినిమా చేశారు.
లేటెస్ట్ గా 'రాజా విక్రమార్క'లో ఎన్ఐఏ ఏజెంట్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. . ఈ సందర్భంగా కార్తికేయ మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు…
'రాజా విక్రమార్క'గా కార్తికేయ
నేను ఇప్పటివరకూ ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇందులో యాక్షన్ కూడా స్టయిలిష్‌గా ఉంటుంది.ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్రస్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో ఆటు వినోదం కూడా ఉంటుంది.
ప్రశ్న: కామెడీ… యాక్షన్… ఏది కష్టం
ఆల్రెడీ యాక్షన్ చేశాను ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కామెడీ చేయలేదు. … నేను బయట చాలా జోవియల్‌గా ఉంటాను. జోక్స్ వేయడం, ఫ్రెండ్స్ మీద పంచ్ డైలాగ్స్ వేయడం ఎక్కువ. అందువల్ల, కామెడీ చేయడం కష్టం ఏమీ అనిపించలేదు. బయట ఎలా ఉంటానో అలా నటిస్తే క్యారెక్టర్ చేయవచ్చని అనిపించింది. డైరెక్టర్ కూడా అదే చెప్పాడు. ట్రైలర్ విడుదలయ్యాక కామెడీ టైమింగ్ బావుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా.
ఎగ్జైట్ చేసిన పాయింట్?
కథ డీల్ చేసిన విధానం. బేసిగ్గా… కామెడీ బేస్ చేసుకుని యాక్షన్ సినిమా ఇది. . స్క్రిప్ట్ నచ్చింది. అయితే… సినిమా చూస్తే గానీ చెప్పలేం. అటువంటి స్క్రిప్ట్. వినడానికి బావుంటుంది. కానీ, కరెక్ట్ విజువల్, మ్యూజిక్ పడినప్పుడు స్క్రీన్ మీద చూడటానికి బావుంటుంది. మేకింగ్ మీద డిపెండ్ అయిన సినిమా. శ్రీని కలిసినప్పుడు అతను చేయగలడని అనిపించింది. ఒక్కో షెడ్యూల్ అవుతున్నప్పుడు నా నమ్మకం మరింత బలపడింది.
'రాజా విక్రమార్క'… మెగాస్టార్ టైటిల్
శ్రీ ముందు ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. 'రాజా విక్రమార్క' టైటిల్ సౌండింగ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాజిటివిటీ… మెగాస్టార్ టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు.
మెగాస్టార్ కు చెప్పారా?
టైటిల్ పెట్టిన తర్వాత చెప్పాను. ముందు టైటిల్ దొరుకుతుందో? లేదో? అని చెక్ చేశాం. టైటిల్ ఉందని తెలిశాక రిజిస్టర్ చేశా. తర్వాత ఆయనకు పంపించాను. 'గుడ్ లక్' అని చెప్పాను. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని ఒక సంతోషం. ఆయన సినిమా టైటిల్స్ అన్నీ ఆయనవే. కొంతమంది అభిమానులు పిల్లలకు తమ అభిమాన హీరో పేరు పెట్టుకుంటారు. అలా అభిమానంతో పెట్టుకున్నాను.
ప్రేక్షకులు గర్వపడే సినిమాలు
ఇమేజ్, మార్కెట్ అంటూ భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటే… తెలియకుండా ఒత్తిడిలోకి వెళ్లి కథలో బేసిక్ పాయింట్స్ మిస్ అవుతున్నాను. ఓ ప్రేక్షకుడిగా కథ విని, ఆ సినిమాను ఎలా హిట్ చేయాలి? అనేది ఆలోచించాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఎంత పెద్ద హిట్ అవుతుందనేది పక్కన పెడితే… ముందు మంచి సినిమా అవుతుంది. మినిమమ్ హిట్ అవుతుంది.
అందరితో స్నేహం
మనం నెగెటివ్ గా ఉండకపోతే చాలు. ఎదుటి వ్యక్తి కూడా మన గురించి నెగెటివ్ గా అనుకోరు. మనం పాజిటివ్ గా ఉంటే అందరూ పాజిటివ్ గా ఉంటారు. మనం ఎలా ఉంటే ఎదుటి వాళ్లు అలా ఉంటారని నమ్ముతాను. మన లోపల నెగెటివిటీ పెట్టుకుని బెహేవ్ చేస్తే… ఎదుటివాళ్లకు తెలుస్తుంది. విశ్వక్ సేన్ 'అందరు హీరోలు కలిసి ఒకరి గురించి మంచిగా మాట్లాడుతున్నారంటే అది కార్తికేయ గురించి' అని అన్నాడు. అంత మంచి మాట అంటాడని నేనూ ఊహించలేదు. నాకున్న మంచి పేరును కంటిన్యూ చేసుకోవాలని అనిపించింది.
బాడీ మెయింటైన్ చేయడం ఎంత కష్టం?
నా బాడీ, ఫిజిక్ వల్లే 'ఆర్ఎక్స్ 100' ఛాన్స్ వచ్చింది. అజయ్ భూపతిని 'సార్! నేను మీకు ఎలా తెలుసు? నేను యాక్టింగ్ చేస్తానని…' అని అడిగా. 'అవన్నీ నాకు తెలియదు. నీకు బాడీ ఉందని తీసుకున్నాను. యాక్టింగ్ నేను చేయించుకుందామని అనుకున్నాను. అంతే' అన్నాడు. తర్వాత 'గ్యాంగ్ లీడర్' అప్పుడు దర్శకుడు విక్రమ్ కె. కుమార్‌తో 'నన్ను ఎందుకు తీసుకున్నారు?' అని అడిగా. 'నీకు మంచి బాడీ ఉంది' అన్నారు. ఇప్పుడు 'వలిమై'లో కూడా అందుకే తీసుకున్నారు. బాడీ వల్ల నాకు చాలా ఛాన్సులు వచ్చాయి. ఫిజిక్ ఉండటం నాకు అడ్వాంటేజ్ అయ్యింది. దాని వల్ల రోల్స్ వచ్చాయి. బాడీ అలా మెయింటైన్ చెయ్యడం కష్టమే. అయితే… అవకాశాలు వస్తున్నప్పుడు పర్లేదు. కష్టం పడొచ్చు.
'వలిమై'లో విలన్‌గా
ఫస్ట్ డే అజిత్ గారితో నా కాంబినేషన్ సీన్స్ లేవు. నార్మల్ షూట్ చేశారు. సెకండ్ డే అజిత్ తో సీన్స్ తీశారు. ఆయన్ను కలిసే ముందువరకూ కొంచెం టెన్షన్ ఉంది. నాకు తెలియని లాంగ్వేజ్. ఆయన పెద్ద స్టార్. ఎలా ఉండాలో, ఏంటో? అని. ఆయన్ను కలిసిన ఒక నిమిషంలో చాలా కంఫర్టబుల్‌గా ఉండొచ్చనే వైబ్ ఇచ్చేశారు. ఈ సినిమా కోసం తమిళ్ కొంత నేర్చుకున్నాను.
తమిళంలో డబ్బింగ్ ?
చెప్పాను. అయితే … దర్శకుడు వినోద్ 'సార్. నాకే అక్కడక్కడా తెలుగులో మాట్లాడినట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి' అని చెప్పాను. ఫైనల్ మిక్సింగ్ అయ్యాక చూస్తానని అన్నారు.