హీరో కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా, నేహా శెట్టి కథానాయికగా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న చిత్రం 'బెదురులంక 2012'. క్లాక్స్ దర్శకత్వంలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మంచి అంచనాల మధ్య విడుదలవుతున్న సందర్భంగా హీరో కార్తికేయ ‘గ్రేట్ ఆంధ్ర’తో మాట్లాడారు.
ఈ సినిమాలో రెగ్యులర్ హీరో – విలన్ టెంప్లేట్ ఫాలో అవ్వకుండా రియాలిటీ కి దగ్గర్లో ఉండే పాత్రలతో నేటివిటీ ఉట్టిపడేలా కథని చివరి వరకు ఆసక్తికరంగా తీసుకెళ్లారు. అందమైన గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో కడుపుబ్బా నవ్విస్తూనే ఆలోచింప చేసే కథే 'బెదురులంక 2012'. అప్పట్లో యుగాంతం అవుతుందనే వార్తని లక్షల మంది నమ్మారు. అలా నమ్మిన ఒక ఊరి ప్రజల కి చివరికి ఏమైంది? అనే కథనం ఆసక్తి రేపుతుంది. మొదటి చిత్రమైనా కూడా క్లాక్స్ అద్భుతంగా తీశారు. నా పాత్ర కామెడీ టైమింగ్, ఎమోషనల్ గ్రాఫ్ చాలా బాగా తీసుకెళ్లారు అని అన్నారు హీరో కార్తికేయ.
నా సినీ ప్రయాణంలో ఇప్పటివరకు ప్రతీ నిర్ణయంతో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాను. చేసిన తప్పులని మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడుతున్నాను. ఇదివరకటిలా ఇప్పుడు వెంటవెంటనే కథలని ఓకే చెయ్యట్లేదు. ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉందో గమనిస్తూనే వైవిధ్యమైన కథలని ఎంచుకోడానికి ప్రయత్నిస్తున్నాను.
గ్యాంగ్ లీడర్ చేసినా వాలిమై చేసినా విలన్ పాత్రలా కాకుండా కథలో నేనెంత సెట్ అవుతానని అలోచించే చేసాను. లక్షల మందిలో ఒకరికి దొరికే అదృష్టం హీరో అవ్వడం, దాన్ని నేను ఏ రోజు ఈజీ గా తీసుకోను. అలాగే, పేరు కి మించిన బడాయిలకి పొగడ్తలకి దూరంగా ఉంటాను అది సోషల్ మీడియా లో ఎక్కువగా చూస్తుంటాను అన్నారు కార్తీకేయ.
ఇటీవల విడుదలైన 'వెన్నెల్లో ఆడపిల్ల', 'సొల్లుడా శివ', 'దొంగోడే దొరగాడు' పాటలు ట్రెండ్ అవుతుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి అందించిన సంగీతం తన కేరీర్ లో నే బెస్ట్ అని చెప్పడం విశేషం.