గ్యాప్ అలా వచ్చింది.. కావాలని తీసుకోలేదు

ఆర్ఎక్స్100 ఇచ్చిన ఉత్సాహంతో వరుసపెట్టి సినిమాలు చేశాడు కార్తికేయ. అయితే పెద్దగా క్లిక్ అవ్వలేకపోయాడు. ఈ క్రమంలో విలన్ పాత్రలు కూడా వేశాడు. అయినప్పటికీ సెట్ అవ్వలేకపోయాడు. దీంతో అతడి కెరీర్ లో చిన్న…

ఆర్ఎక్స్100 ఇచ్చిన ఉత్సాహంతో వరుసపెట్టి సినిమాలు చేశాడు కార్తికేయ. అయితే పెద్దగా క్లిక్ అవ్వలేకపోయాడు. ఈ క్రమంలో విలన్ పాత్రలు కూడా వేశాడు. అయినప్పటికీ సెట్ అవ్వలేకపోయాడు. దీంతో అతడి కెరీర్ లో చిన్న గ్యాప్ వచ్చేసింది.

ఇదే అంశంపై గ్రేట్ ఆంధ్ర ప్రశ్నించింది. 'గ్యాప్ అలా వచ్చేసింది, కావాలని తీసుకోలేదనేది' కార్తికేయ ఆన్సర్. అలా గ్యాప్ రావడానికి ఆయన కొన్ని సహేతుకమైన కారణాలు కూడా చెప్పాడు.

“గ్యాప్ వచ్చిందనేది నిజం. కావాలని తీసుకున్నది మాత్రం కాదు. రాజా విక్రమార్క సినిమా తర్వాత బెదురులంక స్టార్ట్ చేశాను. నిజానికి ఈ సినిమాతో పాటు యూవీ క్రియేషన్స్ లో మరో సినిమా చేశాను. ఈ రెండూ ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. యూవీ సినిమాలో లాంగ్ హెయిర్, బెదురులంకలో షార్ట్ హెయిర్. అది మేనేజ్ చేసే క్రమంలో ఆటోమేటిగ్గా టైమ్ ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది.”

మరోవైపు నిర్మాతల వ్యాపార లావాదేవీల వల్ల కూడా తన కెరీర్ లో చిన్న గ్యాప్ వచ్చిందని, సినిమాలు ఆలస్యమయ్యాయని వెల్లడించాడు. ఈ కారణాలతో పాటు, వరుసగా వస్తున్న ఫ్లాపుల వల్ల కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నానని, ఒకప్పట్లా ఫటాఫట్ సినిమాలకు ఓకే చెప్పడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక. ఇదొక ఫన్ బేస్డ్ మూవీ అంటున్నాడు కార్తికేయ. 2012లో యుగాంతం అనే రూమర్ క్రియేట్ అయింది. ఆ టైమ్ లో బెదురులంక అనే గ్రామంలో మనుషులు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ల వీక్ నెస్ ను ఆసరాగా చేసుకొని కొంతమంది ఎలాంటి చెత్త పనులు చేశారు, అలాంటి టైమ్ లో హైదరాబాద్ నుంచి హీరో ఆ ఊరులోకి వచ్చి, ఊరును ఎలా మార్చాడు… అనే విషయాన్ని ఈ సినిమాలో వినోదాత్మకంగా చెప్పారు.