కథ ఇస్తే సరిపోదు..డైరక్ట్ చేయాలి

దర్శకుడిగా కన్నా కథకుడిగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. దర్శకుడిగా సినిమా చేయాలంటే ఏడాది నుంచి రెండేళ్లు పడుతోంది. పైగా అందరితోనూ చేయలేరు. కానీ కథ, స్క్రిప్ట్ అయితే ఇవ్వగలరు. అందుకే వైష్ణవ్ తేజ్…

దర్శకుడిగా కన్నా కథకుడిగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. దర్శకుడిగా సినిమా చేయాలంటే ఏడాది నుంచి రెండేళ్లు పడుతోంది. పైగా అందరితోనూ చేయలేరు. కానీ కథ, స్క్రిప్ట్ అయితే ఇవ్వగలరు. అందుకే వైష్ణవ్ తేజ్ సినిమాకు ఇస్తున్నారు. భీమ్లానాయక్ కు సాయం పట్టారు. వినోదసితం రీమేక్ కు చేయి అందిస్తున్నారు. ఇంకా ఆయన దగ్గర చాలా ఐఢియాలే వున్నాయి. కానీ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా చాలా వ్యవహారాలు వుంటాయి. కాంబినేషన్ లు, కాలుక్యులేషన్లు ఇలా చాలా వుంటాయి మధ్యలో.

టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే చాలా కాలం అంటే మరీ చాలా కాలం కిందట కాదు కానీ కొంత వెనకటికే త్రివిక్రమ్ ఓ లైన్ ను విజ‌య్ దేవరకొండకు చెప్పారు. అతగాడికి నచ్చింది. ఆ తరువాత ఆ వ్యవహారం అలా వుండిపోయింది. లేటెస్ట్ గా మళ్లీ ఇది బయటకు వచ్చినట్లు బోగట్టా. త్రివిక్రమ్ అడిగారో లేదా విజ‌య్ నే అడిగారో మొత్తానికి ఈ ప్రాజెక్టును మేజ‌ర్ మూవీ దర్శకుడు శశికిరణ్ టిక్కా డైరక్షన్ లో చేయాలన్న ప్రతిపాదన వచ్చిందని తెలుస్తోంది.

కానీ త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తే చేయానికి సిద్దమని, వేరే వాళ్లతో అయితే ఆలోచిస్తా అని విజ‌య్ చెప్పినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ నే చేయాలి అంటే కనీసం మూడేళ్లు ఆగాలి. ఎందుకంటే మహేష్ సినిమా, తరువాత బన్నీ సినిమా లైన్ లో వున్నాయి. ఆ తరువాత రానా తో హిరణ్య కశిప చేసే ఆలోచన కూడా వుంది.

నిజానికి సరైన దర్శకుడు దొరికిితే త్రివిక్రమ్ లాంటి వాళ్లు స్క్రిప్ట్ ఇచ్చినా ఒకే నే. వర్క్ బాగుంటుంది. పేరు కూడా యాడ్ అవుతుంది. అందరికీ త్రివిక్రమ్ నే కావాలంటే కుదరదు కదా…యంగ్ హీరోలు ఎవరైనా ఇలాంటి ఆఫర్ వస్తే జాగ్రత్తగా సెట్ చేసుకుంటే బాగానే వుంటుంది.

2 Replies to “కథ ఇస్తే సరిపోదు..డైరక్ట్ చేయాలి”

Comments are closed.