అజ్ఞాతవాసి కాంబో.. అభిమానుల్లో కంగారు

పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ పీడకల అజ్ఞాతవాసి. పవన్ కెరీర్ లోనే కాదు, దర్శకుడు త్రివిక్రమ్ కెరీర్ లో కూడా అతి చెత్త సినిమా అది. పవన్-త్రివిక్రమ్ ను మినహాయిస్తే.. ఆ సినిమాకు సంబంధించి…

పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ పీడకల అజ్ఞాతవాసి. పవన్ కెరీర్ లోనే కాదు, దర్శకుడు త్రివిక్రమ్ కెరీర్ లో కూడా అతి చెత్త సినిమా అది. పవన్-త్రివిక్రమ్ ను మినహాయిస్తే.. ఆ సినిమాకు సంబంధించి మళ్లీ ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా అజ్ఞాతవాసి ప్రభావం వాళ్లపై పడడం ఖాయం. ఇప్పుడు అలాంటిదే ఓ కాంబినేషన్ తెరపైకి వచ్చేలా ఉంది.

అవును.. అజ్ఞాతవాసిలో తన సరసన నటించిన కీర్తిసురేష్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడట పవన్. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ హీరో. ఇందులో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే కనుక జరిగితే మరోసారి అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకాలు తెరపైకి రావడం ఖాయం.

నిజానికి ఈ సినిమా విషయంలో ముందుగా ప్రగ్యా జైశ్వాల్ పేరు తెరపైకి వచ్చింది. క్రిష్-ప్రగ్యా క్లోజ్ కాబట్టి ఆమెనే రిపీట్ చేస్తాడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత ఓ బాలీవుడ్ హీరోయిన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కీర్తిసురేష్ చుట్టూ పుకార్లు తిరుగుతున్నాయి. హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు.

మరోవైపు హీరోయిన్ లేకుండానే సెకెండ్ షెడ్యూల్ లోకి ఎంటరైంది ఈ సినిమా. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో పవన్-క్రిష్ సినిమాకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది.

బాధపడుతున్న వంశీ పైడిపల్లి