కేజ్రీవాల్ Vs ఆర్ఆర్ఆర్.. టెన్షన్ లో రాజమౌళి

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఆర్ఆర్ఆర్ కి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..?  కరోనా కారణంగా చాన్నాళ్లుగా వాయిదా వేసుకుంటూ వస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ ని ఎట్టకేలకు జనవరి7న ప్లాన్ చేశారు దర్శకుడు రాజమౌళి. సరిగ్గా…

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఆర్ఆర్ఆర్ కి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..?  కరోనా కారణంగా చాన్నాళ్లుగా వాయిదా వేసుకుంటూ వస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ ని ఎట్టకేలకు జనవరి7న ప్లాన్ చేశారు దర్శకుడు రాజమౌళి. సరిగ్గా 10 రోజుల గ్యాప్ ఉంది. ఈలోగా దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మార్పులొస్తున్నాయి. నైట్ కర్ఫ్యూల వల్ల సినిమాలకు పెద్ద నష్టమేనీ జరగదు. కానీ థియేటర్లు మూసేస్తేనే అసలు సమస్య.

ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు సినిమా థియేటర్లు మూసేసింది. ఎల్లో అలర్ట్ ప్రకటించి స్కూళ్లు, థియేటర్లు, మూసేస్తున్నామని చెప్పింది. ఇతర వ్యవహారాలపై ఆంక్షలు విధించింది. ఈ దశలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు దేశ రాజధానిలో చోటు లేకుండా పోయింది.

ఢిల్లీలో ఎల్లో అలర్ట్ తో సినిమా థియేటర్లకు మూతపడింది. బాహుబలి కలెక్షన్లు తిరగరాయాలనుకున్న రాజమౌళి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. జనవరి 7నాటికి మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. రాజమౌళి వెనకడుగు వేస్తారా..? లేక ముందుకే వెళ్తానంటారా అనేది వేచి చూడాలి.

ఒమిక్రాన్ వచ్చినా, ఇంకేదైనా వచ్చినా తగ్గేది లేదంటూ గతంలోనే ప్రకటించారు రాజమౌళి. సినిమా డేట్ ఫిక్స్ చేసుకుని అన్ని రాష్ట్రాల్లో ప్రచారాలు ఓ రేంజ్ లో చేపట్టారు. టీమ్ ని వెంటేసుకుని టూర్లు చేస్తున్నారు. ఈ దశలో రాజమౌళి వెనకడుగేస్తారని అనుకోలేం. ఓవైపు వాయిదా అంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూనే, మరోవైపు సినిమా ప్రమోషన్ ను పరుగులు పెట్టిస్తున్నారు.

కానీ పరిస్థితి చేయి దాటితే జక్కన్న కాదు కదా, ఇంకెవరైనా సరే తలొంచాల్సిందే. ఈ దశలో రాజమౌళి, దానయ్య ఎంత టెన్షన్ పడుతున్నారో ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.

బాహుబలిని క్రాస్ చేయడం కష్టం..

ఢిల్లీ ఒక్కచోట థియేటర్లు మూసుకుపోతే పెద్ద నష్టమేం లేదు కానీ, మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. అందులోనూ ఏపీలో థియేటర్లకు తాళాలు పడుతున్నాయి. విదేశీ కలెక్షన్లపై కూడా పెద్దగా ఆశలు లేవు. కొన్ని యూరోప్ దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమల్లోకి వచ్చేసింది. అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్ కి ఇవన్నీ అడ్డంకులే.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాహుబి-2 వసూళ్లను క్రాస్ చేయాలనే టార్గెట్ పెట్టుకోవడం అత్యాశే అవుతుంది. ఢిల్లీ బాటలో మరికొన్ని రాష్ట్రాలు సినిమా థియేటర్లపై కీలక నిర్ణయం తీసుకుంటే.. ఆ తర్వాత తన సినిమాపై రాజమౌళి మరింత కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.