మరోసారి రామ్ చరణ్ సరసన ఛాన్స్..!

హీరోయిన్లకు మళ్లీ మళ్లీ అవకాశాలివ్వడం చరణ్ కు కొత్తేం కాదు. ఇప్పటికే రకుల్, కాజల్ లాంటి హీరోయిన్లను రిపీట్ చేశాడు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కియరా అద్వానీని కూడా రిపీట్ చేస్తున్నాడు. అవును..…

హీరోయిన్లకు మళ్లీ మళ్లీ అవకాశాలివ్వడం చరణ్ కు కొత్తేం కాదు. ఇప్పటికే రకుల్, కాజల్ లాంటి హీరోయిన్లను రిపీట్ చేశాడు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కియరా అద్వానీని కూడా రిపీట్ చేస్తున్నాడు. అవును.. చరణ్ నెక్ట్స్ సినిమాలో కియరానే హీరోయిన్.

త్వరలోనే శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు చరణ్. ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా పేరును అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ఆమె పుట్టినరోజు. అందుకే ఈరోజు ఈ విషయాన్ని బయటపెట్టారు.

నిజానికి ఈ సినిమాలో కియరా లాక్ అయిందనే విషయం చాన్నాళ్ల కిందటే లీకైంది. పరోక్షంగా కియరా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది ఆమధ్య. మధ్యలో రష్మిక పేరు చక్కర్లు కొట్టినప్పటికీ.. ఈరోజు లాంఛనం పూర్తయింది. వినయవిధేయ రామ సినిమా తర్వాత చరణ్-కియరా కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.

నిర్మాతగా దిల్ రాజుకు ఇది 50వ సినిమా. అందుకే దీన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. శంకర్ లాంటి దర్శకుడ్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకు లొకేషన్లు వెదికే పనిలో శంకర్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.