ఒకే అపార్ట్ మెంట్ లో .. కొహ్లీ, క‌త్రినా జంట‌ల కాపురం!

ముంబైలో ఒక అపార్ట్ మెంట్లో కాపురం పెడుతున్నాయి రెండు సెల‌బ్రిటీ జంట‌లు. ఇప్ప‌టికే భార్యాభ‌ర్త‌లైన‌ విరాట్ కొహ్లీ, అనుష్కా శ‌ర్మ‌. త్వ‌ర‌లోనే వివాహం చేసుకోనున్న క‌త్రినాకైఫ్, విక్కీ కౌశ‌ల్ లు ఒకే అపార్ట్ మెంట్లో…

ముంబైలో ఒక అపార్ట్ మెంట్లో కాపురం పెడుతున్నాయి రెండు సెల‌బ్రిటీ జంట‌లు. ఇప్ప‌టికే భార్యాభ‌ర్త‌లైన‌ విరాట్ కొహ్లీ, అనుష్కా శ‌ర్మ‌. త్వ‌ర‌లోనే వివాహం చేసుకోనున్న క‌త్రినాకైఫ్, విక్కీ కౌశ‌ల్ లు ఒకే అపార్ట్ మెంట్లో కాపురం పెడుతున్నారు. 

ఇప్ప‌టికే ఆ అపార్ట్ మెంట్ లో విరాట్, అనుష్క‌లు అడ‌పాద‌డ‌పా ఉంటున్నారు. వారి అందులో వారు రెండు ఫ్లోర్ల‌లో నివ‌సిస్తున్నారు. అదే అపార్ట్ మెంట్ లో ఒక ఫ్లోర్ ను రెంటుకు తీసుకున్నాడట విక్కీ కౌశ‌ల్. వివాహం త‌ర్వాత క‌త్రినా, విక్కీలు అక్క‌డే కాపురం పెట్టనున్నార‌ట‌.

క‌త్రినా, విక్కీ లు రెంట్ కు తీసుకున్న‌ది ఎనిమిదో ఫ్లోర్. దాని రెంట్ నెల‌కు ఎనిమిది ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో మొద‌ల‌వుతోంద‌ట‌. మూడేళ్ల‌కు గానూ వీరు అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ట్టుగా స‌మాచారం. 

తొలి ఏడాది ఎనిమిది ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున రెంట్, ఆ త‌ర్వాత రెండో ఏడాదికి గానూ నెల‌కు న‌ల‌భై వేల రూపాయ‌లు ఎక్కువ‌, ఆపై మూడో ఏడాది నెల‌కు న‌ల‌భై వేల రూపాయ‌ల మొత్తాన్ని అద‌నంగా చెల్లించ‌నున్నార‌ట‌.

ఈ మేర‌కు మూడేళ్ల‌కు అగ్రిమెంట్ అని, దీనికి గానూ విక్కీ కౌశ‌ల్ కోటీ డెబ్బై ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల మొత్తాన్ని ఒకేసారి చెల్లించాడ‌ని రియాలిటీ సంస్థ ఒకటి స‌మాచారం ఇచ్చింది. నెల‌కు ఎనిమిది ల‌క్ష‌ల రూపాయ‌ల రెంట్ ఉన్న ఆ ఫ్లోర్ అత్యంత ల‌గ్జ‌రీయ‌స్ గా ఉంటుంద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. 

విరాట్ కొహ్లీ, అనుష్కా శ‌ర్మ‌లు అదే అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టారంటే.. వారి రేంజ్ కు ఇల్లు ఎలా ఉంటుందో వేరే వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. సీ ఫేసింగ్ తో ఆల్ట్రా ల‌గ్జ‌రియ‌స్ సెట‌ప్ తో  ఆ ఇల్లు అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. విరాట్, అనుష్క‌ల ఆర్థిక శ‌క్తికి త‌గ్గ‌ట్టుగా వారు రెండు ఫ్లోర్ల లో విస్త‌రించిన ఫ్లాట్ లో మ‌కాం పెట్ట‌గా, క‌త్రినా, విక్కీలు ఒక ఫ్లోర్ లో విస్త‌రించిన ఫ్లాట్ కు ప‌రిమితం అయిన‌ట్టుగా ఉన్నారు.