కొంప ముంచిన ‘చిరు’ కామెంట్!

ఒక్కోసారి ఒక్కో చిన్న మాట..పెను ప్రమాదం తెచ్చి పెడుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళాశంకర్ ఫ్లాప్ అయింది. అందులో డౌట్ లేదు. ఆ ఫ్లాప్ ను ఎపిక్ డిజాస్టర్ గా మార్చింది మాత్రం ఆయన…

ఒక్కోసారి ఒక్కో చిన్న మాట..పెను ప్రమాదం తెచ్చి పెడుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా భోళాశంకర్ ఫ్లాప్ అయింది. అందులో డౌట్ లేదు. ఆ ఫ్లాప్ ను ఎపిక్ డిజాస్టర్ గా మార్చింది మాత్రం ఆయన మాటలే. 

అందరూ అనుకుంటున్నట్లు వైకాపా నేతల మాటల మీద చిరు చేసిన కామెంట్ లు కాదు. అవి కూడా కొంత వరకే కారణం. కానీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ఓ సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా కసి కట్టుకుని పగ పెట్టుకుని చేయడం వెనుక మరో డైలాగు వుంది. 

‘అప్పట్లో నేనూ…అప్పట్లో నేను అని నువ్వు అన్నావంటే, ఇప్పుడేం కావు అన్నమాట’ ఇదీ చిరు వేసిన డైలాగు. ఈ డైలాగు ఎవరికి తగిలిందో, తగులుతుందో సినిమా ఫ్యాన్స్ కు విడమరిచి చెప్పనక్కరలేదు.

అందుకే సినిమా చచ్చిపోయి మూడు రోజులు దాటినా ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వార్తలు, ట్వీట్ లు వండి వారస్తూనే వుంది. మా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నట్లుగా, తమ హీరోను ఓ మాట అంటే తాము ఊరుకుంటారా… ఓ లెక్కలో వేసుకుంటారుగా. అందుకే హీరోలు పబ్లిక్ లో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. దాని వల్ల ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయితే కావచ్చు. కానీ లేని పోని వివాదాలు రావు.

ప్రభాస్ జస్ట్ రెండు మూడు నివిషాలు మాట్లాడి వదిలేస్తారు. ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. కానీ వేరే వైపు నుంచి ఎటువంటి టార్గెట్ వుండదు. కానీ చిరు, బాలయ్య, పవన్ లాంటి వారు కాస్త ఎక్కువ మాట్లాడుతుంటారు. అక్కడే పొరపాటునో, గ్రహపాటునో నోరు జారే ప్రమాదం వుంటుంది.