Advertisement

Advertisement


Home > Movies - Movie News

కొరటాల..సత్యదేవ్…కృష్ణమ్మ

కొరటాల..సత్యదేవ్…కృష్ణమ్మ

ఫ్లాప్, హిట్ లతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద అని చూసుకోకుండా మంచి పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న హీరో సత్యదేవ్. అతగాడి లేటెస్ట్ సినిమా కృష్ణమ్మ. టాప్ డైరక్టర్లలో ఒకరైన కొరటాల శివ తొలిసారిగా ఓ సినిమాను సమర్పిస్తున్నారు అంటే కాస్త ఆసక్తి వుంటుంది. కృష్ణమ్మ సినిమా కు సమర్పకుడు ఆయనే.

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద.. కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీ వీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేసారు. 

పోస్టర్‌లో కత్తి పట్టుకుని స‌త్య‌దేవ్ నిలుచుకున్నారు. కింద నెత్తుడి ఏరు వున్నట్లుగా వుంది. మంచి, చెడుల కలయిక ..పగ, ప్రేమ కలయిక.. మనిషి నడక అనే ఓ భావాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేసినట్లుంది.

ఈ యాక్షన్ మూవీకి సన్నీ కూరపాటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?