కోటబొమ్మాళి ఫోక్ సాంగ్

తెలుగులో అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన గీతా అనుబంధ జిఎ2 సంస్థ నిర్మిస్తున్న సినిమా కోటబొమ్మళి పిఎస్. మలయాళ సూపర్ హిట్ నయాట్టు సినిమాను ఇప్పుడు తెలుగులో ఈ టైటిల్ తో అందిస్తున్నారు.…

తెలుగులో అనేక సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన గీతా అనుబంధ జిఎ2 సంస్థ నిర్మిస్తున్న సినిమా కోటబొమ్మళి పిఎస్. మలయాళ సూపర్ హిట్ నయాట్టు సినిమాను ఇప్పుడు తెలుగులో ఈ టైటిల్ తో అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ మాంచి ఫోక్ సాంగ్ ను రూపొందించారు. 

శ్రీకాకుళం మాండలీకంలో ఈ పాటను రూపొందించారు. శ్రీకాకుళం మాండలీకంలో ఫోక్ సాంగ్ లు సినిమాల్లోకి రావడం అరుదు. అల వైకుంఠపురములో ‘సిత్తరాల సిరపడు’ అక్కడి పాటే. ఏ రేంజ్ హిట్ అన్నది అందరికీ తెలిసిందే. ‘నాయమ్మా..నాతల్లీ అంటూ సాగిన ఈ పాట ఫుల్ జోష్ బీట్ తో సాగింది. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు

ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాట తో పాటు వదిలిని విడియో విజువల్స్ ఫుల్ ఫోక్ మాస్ తో వున్నాయి. డ్యాన్స్ స్టెప్ లు, బీట్ రెండూ కలిసి పాటను వైరల్ చేసేలాగే వున్నాయి.

మంచి చిన్న సినిమాలను, ముఖ్యంగా కథా బలం వున్న సినిమాలను ఎంచుకుని గత కొంతకాలంగా ముందుకు సాగుతోంది జిఎ 2 సంస్థ. ఆఫ్ బీట్ సినిమాలను కూడా నిర్మించడానికి వెనుకాడడం లేదు.