Advertisement

Advertisement


Home > Movies - Movie News

కౌసల్య కృష్ణమూర్తి.. రీమేక్ కమ్ డబ్బింగ్ సినిమా

కౌసల్య కృష్ణమూర్తి.. రీమేక్ కమ్ డబ్బింగ్ సినిమా

డబ్బింగ్ సినిమాలుంటాయి, లేదంటే రీమేక్ సినిమాలుంటాయి. కానీ డబ్బింగ్, రీమేక్ మిక్స్ చేసిన సినిమాలు తక్కువగా ఉంటాయి. అలాంటి సినిమానే కౌసల్య కృష్ణమూర్తి. దీన్ని పూర్తిస్థాయి రీమేక్ సినిమాగా చెప్పలేం. తమిళ్ లో సూపర్ హిట్ అయిన కణ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతోంది కౌసల్య కృష్ణమూర్తి. ఓ మహిళా క్రికెటర్ పాత్రలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇందులో కనిపించనుంది. ఆమె తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తున్నాడు. తమిళ్ లో ఈ పాత్రను సత్యరాజ్ పోషించాడు.

తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ లో సీన్లు మాత్రమే తీసినట్టు తెలుస్తోంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న చాలా సన్నివేశాల్ని ఒరిజినల్ కణ సినిమా నుంచి యథాతథంగా వాడినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా కీలకపాత్ర పోషించిన శివకార్తికేయన్ కు సంబంధించిన సన్నివేశాల్ని తమిళ వెర్షన్ నుంచి యాజ్ ఇటీజ్ వాడుకుంటున్నారట. ఆ సన్నివేశాలకు డబ్బింగ్ మాత్రం చెబితే సరిపోతుందన్నమాట. షూట్ చేయాల్సిన అవసరం లేదు.

గతంలో గురు సినిమాకు కూడా ఇలానే చేశారు. వెంకటేష్ హీరోగా నటించిన ఆ సినిమాలో రితికా సింగ్ కు సంబంధించిన బాక్సింగ్ సన్నివేశాల్ని ఒరిజినల్ వెర్షన్ ను ఉన్నది ఉన్నట్టు వాడేశారు. ఇప్పుడు కౌసల్య కృష్ణమూర్తికి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారట. 

ఆత్మవిమర్శ అవసరం.. దిక్కుతోచని స్థితిలోనే ఈ పనులు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?