క్రిష్..పవన్..నిత్యం క్లాసులేనా?

టాలీవుడ్ లో రాబోతున్న ప్రామిసింగ్ సినిమాల జాబితాల్లో కచ్చితంగా వుండే సినిమా హరిహర వీరమల్లు. రొటీన్ సినిమా గా కాకుండా ఓ పీరియడ్ కమర్షియల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది.  Advertisement పవన్…

టాలీవుడ్ లో రాబోతున్న ప్రామిసింగ్ సినిమాల జాబితాల్లో కచ్చితంగా వుండే సినిమా హరిహర వీరమల్లు. రొటీన్ సినిమా గా కాకుండా ఓ పీరియడ్ కమర్షియల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది. 

పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. కానీ ఇలాంటి ప్రామిసింగ్ సినిమా వివిధ కారణాల వల్ల ఆలస్యం అయిపోతోంది. నిజానికి హీరో పవన్ కళ్యాణ్ కనుక సీరియస్ గా దృష్టి పెడితే ఈ సినిమా ఎప్పుడో రెడీ అయిపోయేది.

ఈ సినిమా ప్రారంభమైన తరువాత నత్త నడక నడవానికి ఒక విధంగా పవన్ కళ్యాణ్ నే కారణం అంటే ఫ్యాన్స్ కు కోపం రావచ్చు. కానీ అది వాస్తవం. ఈ సినిమా వుండగానే మరో సినిమా ఓకె చేయడం ఫినిష్ చేయడం చేసారు. తరచు ఆయనకు వున్న పొలిటికల్ కమిట్ మెంట్ల వల్ల హరి..హర ఆలస్యం అవుతూ వచ్చింది.

కానీ అంతలోనే మళ్లీ స్క్రిప్ట్ డిజైన్ మార్చాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఫైట్లు, పాటల విషయంలో పవన్ మార్పులు కోరారని వార్తలు వచ్చాయి. దాంతో భారీ పైట్లు తగ్గించారని టాక్. ఆ తరువాత మళ్లీ కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవలే షూట్ ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన రోజే సీనియర్ హీరో కృష్ణ మరణించడంతో, ఇంకా ఇండస్ట్రీ నిర్ణయం తీసుకోకుండానే టక్కున క్యాన్సిల్ కొట్టేసారని వార్తలు వచ్చాయి. మరో రోజు షూటింగ్ కు వచ్చి, సెట్ ప్రాపర్టీ అదీ బాగాలేదని క్లాసుపీకి, క్యాన్సిల్ కొట్టారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. 

లేటెస్ట్ గా అసలు ఇంకా సినిమా ఎన్నాళ్లు చేస్తారు. తాను తరువాత సినిమా కి ఎప్పుడు షిప్ట్ అవుతానని దర్శకుడు క్రిష్ కు క్లాస్ పీకారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

మొత్తం మీద పాపం, దర్శకుడు క్రిష్ కు హరిహర వీరమల్లు గొంతులో గరళంలా తయారైంది. మిగిలేరు. ఉంచుకోలేరు.