ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హాస్పిటల్ లో చేరారు. నిన్న రాత్రి ఊపిరి తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కృష్ణంరాజు. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని హుటాహుటిన బంజారాహిల్స్ లో ఉన్న కేర్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
కొద్దికాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు కృష్ణంరాజు. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారడంతో ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు.
డాక్టర్లు నిన్న కృష్ణంరాజును ఐసీయూలో ఉంచారు. పరిస్థితి మెరుగుపడితే ఈరోజే జనరల్ వార్డ్ కు డిశ్చార్జ్ చేస్తారు. ప్రస్తుతం ఆయన సజావుగానే ఊపిరి తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే పాల్గొంటూ వస్తున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో కొనసాగుతూనే, మరోవైపు ప్రభాస్ తో ఓ సినిమా నిర్మిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ తో కలిసి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణ బ్యానర్ పై ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు.