క్రిష్ణం వృింద విహారి అంటూ వస్తున్నాడు హీరో నాగశౌర్య. సంప్రదాయ బ్రాహ్మిన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తయారవుతున్న సినిమా ఇది. సీనియర్ హీరోయిన్ రాధిక కీలకపాత్రలో నటించిన సినిమా ఇది. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.
పక్కా అల్ట్రా మోడరన్ గర్ల్…ఓ సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడి మధ్య ప్రేమ కుదిరితే అన్న పాయింట్ నేపథ్యంలో తయారైన సినిమా. సహజంగా సంప్రదాయ కుటుంబం..దాని అభిరుచులు..వ్యవహారాలు. ఇటు మోడరన్ అమ్మాయి..ఆమె స్వేచ్ఛాభావనలు..ఇవన్నీ సినిమాలో చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది.
టీజర్ చాలా పద్దతిగా ప్రారంభమై ఫుల్ రొమాంటిక్ మూడ్ లోకి మారింది. హీరోయిన్ షెర్లె షెటియా తో నాగశౌర్య రొమాంటిక్ సీన్లు ఓ రేంజ్ లో వున్నాయి. చూస్తుంటే మీడియం సినిమాలకు హుక్ పాయింట్లలో రొమాన్స్ కూడా ఒకటి అని ఫిక్స్ అయినట్లుంది. శౌర్య లుక్స్ బాగున్నాయి. మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం బాగుంది.
శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉష మాల్పూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 22న విడుదలవుతోందీ సినిమా.